మహిళల పాలిట వరం ఈ ఆటో అక్క.. అంత చదువుకుని ఆటో ఎందుకు నడుపుతుంది..? ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

మహిళల పాలిట వరం ఈ ఆటో అక్క.. అంత చదువుకుని ఆటో ఎందుకు నడుపుతుంది..? ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Megha Varna

Ads

ఈ కాలంలో కూడా అమ్మాయిలకి డేరింగ్, డాషింగ్ ఉందని.. అమ్మాయిలు కూడా అన్నిటిలో ధైర్యంగా రాణించగలరని ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆటో అక్క. ప్రతి రోజు కూడా ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తోంది. రోజంతా కూడా పనిచేస్తూ చాలా మందికి నమ్మకంగా నిలిచింది ఈ ఆటో అక్క. మరి ఆటో అక్క గురించి ఈ ఆర్టికల్ ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చెన్నైకి చెందిన రాజి అనే ఒక ఆమె చాలా కాలం నుంచి ఆటో డ్రైవర్ గా పని చేస్తోంది. నిజంగా ఈమె ఒక డాక్టర్, పోలీస్ లాగ ఎంతో ముఖ్యం.

Video Advertisement

రాత్రిపూట ఆఫీసు ముగిసిన తర్వాత వచ్చే మహిళలకి ఈమె మంచి సపోర్ట్ ఇస్తుంది. చాలా మంది మహిళలు రాత్రి పూట పని చేసి ఇంటికి వెళ్లడం లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈమె కి ఫోన్ చేసి డ్రాప్ చేయమని అంటూ ఉంటారు. అర్ధరాత్రి అయినా… మిట్ట మధ్యాహ్నం అయినా మహిళలు ఈమెని ఎక్కడికైనా తీసుకు వెళ్లాలంటే నిరాకరించడం జరగదు. ప్రతి రోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు పని చేసినప్పటికీ కూడా ఈమె మహిళలు పిలిస్తే తప్పక వెళుతుంది. ఎప్పుడు కూడా ఈమెకి చెన్నై ఎయిర్ పోర్ట్ కి డ్రాప్ చేయమని, ఆఫీస్ కి డ్రాప్ చేయమని లేదా ఇళ్ళకి తీసుకెళ్ళమని ఫోన్లు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే ఈమె కచ్చితంగా వెళుతుంది. కానీ ఒక గంట ముందే రైడ్ బుక్ చేసుకోమని ఈమె కోరుతుంది.

గత 20 సంవత్సరాల నుండి కూడా ఈమె 9 గంటల పాటు ప్రతిరోజూ పని చేస్తోంది. నెలకు 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈమె బీఏ ఫిలాసఫీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో అశోక్ అనే ఆటో డ్రైవర్ ని ప్రేమించింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కోయంబత్తూరుకి వచ్చేశారు.  కోయంబత్తూర్ లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు చెన్నై వెళ్ళిపోయారు. అయితే తర్వాత తిరిగి మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఈమె చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా ఉద్యోగ అవకాశాలు రాలేదు. దీంతో ఆమె తన భర్త లాగే ఆటో డ్రైవర్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇలా ఆమె ఆటో డ్రైవర్ గా మారి చాలా మంది మహిళలకు సర్వీస్ చేస్తోంది… గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈమె చెన్నై లో ఉండే 13 కళాశాలల్లో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చింది. అలానే మహిళలకి ఫ్రీ ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈమె ఇస్తూ ఉంటారు. ఆసక్తి ఉన్న మహిళలకి ఆటోని నేర్పించి ప్రోత్సహిస్తూ ఉంటుంది.


End of Article

You may also like