జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ అయిపోయారు. బాల నటుడిగానే సినిమాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత నెమ్మదిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తాతకి తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు.

Video Advertisement

అద్భుతమైన డాన్స్ తో, నటన తో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ సినిమాలపై ప్రేక్షకులకి అంచనాలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు అంతలా హైప్ ఇవ్వనప్పటికీ కూడా హిట్ అవుతుంటాయి. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఒక సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

Also Read:   ఆ సీరియల్ హీరోతో కోయిలమ్మ నటి “తేజస్విని” లవ్… వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ ఫోటోలు.!

కానీ విచిత్రం ఏమిటంటే ఈ సినిమా బాక్సాఫీస్ పూర్తయ్యేటప్పటికి హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాయే నాన్నకు ప్రేమతో. ఈ సినిమా విడుదల అయినప్పుడు సినిమాకి పోటిగా డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్ప్రెస్ సినిమాలు కూడా థియేటర్లో విడుదలయ్యాయి. దీనితో ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అంతా అనుకున్నారు.

Also Read:  సీతారామం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి “ప్రభాస్” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

కానీ తీరా చూస్తే బొమ్మ రివర్స్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చినా ఫైనల్ గా ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఓవర్సీస్ ప్రేక్షకులకి కూడా ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది.

చెప్పాలంటే ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్లను నాన్నకు ప్రేమతో చిత్రం రాబట్టింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించి ఆకట్టుకున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన రోల్స్ చేసారు.

Also Read:  అతిలోక సుందరి ‘శ్రీదేవిని’ పెళ్లి చేసుకోవాలనుకున్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా ? ఎందుకు ఆగిపోయారంటే ?