Ads
Today Rasi Phalalu in Telugu : 17 july 2021: Today Rasi Phalalu in Telugu ఈ రోజు అనగా 17 జులై 2021 నేటి గ్రహ సంచారం, పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుందో.. చూద్దాం అదే విధంగా చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో చూద్దాం.
Video Advertisement
వృషభ రాశి:
రోజంతా నిరాశగా ఉంటారు, ప్రయాణాలు చేసేవారు ఒకటికి రెండుసార్లు అలోచించి బయలుదేరడం మంచిది. ఉద్యోగరంగాల వారు అవసరం అయితే విరామం తీసుకుంటే మంచిది. మీరు చేస్తున్న పన్నులే మీకు కీర్తిని తెచ్చిపెడతాయి. పట్టుదలతో ముందడుగు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా వ్యవహరించడం మంచిది.
వృశ్చిక రాశి :
అనుకోకుండా ధనలాభం వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. దైవారాధన మీద అధిక ద్రుష్టి పెడుతారు, మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి ముందడుగులు వేస్తారు, వృశ్చిక రాశి చంద్రుడి అనుగ్రహం కలుగుతింది. మీరనుకున్న పనులు కార్యరూపం దాల్చుతాయి.
vrushaba-rasi-phalithaluతులా రాశి:
ఉద్యోగ రంగాల వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ భవిష్యత్ ప్రణాళీకాలను మార్చుకునే ప్రయత్నాలు సాగిస్తారు, విద్యార్థులు చదువు లో పరీక్షల్లో ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి.
సింహ రాశి:
ఉద్యోగ రంగాలవారికి ఈరోజు అనుకూలంగా ఉంది. గతం లో చేసిన కొన్ని చిన్నపాటి తప్పులని మళ్ళీ మళ్ళీ చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యడం మంచిది. మీ చుట్టూ ఉన్నవారు మీతో తప్పుగా ప్రవర్తించవచ్చు. మీరు చేపట్టిన పన్నులు సజావుగా సాగుతాయి.
మిథున రాశి:
మీరు తలపెట్టిన పనుల్లో మొదట తడబాటు కనిపించిన అటు తరువాత ముందడుగు వేస్తారు, ఉద్యోగ రంగాల వారికి శ్రమ తగ్గుతుంది. శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ధనలాభం కూడా ఉంటుంది.
మేష రాశి:
మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఇతరులు ఆటంకాలు కలిగించే సూచనలు ఉన్నాయి. వ్యాపారవర్గాలు వారికి ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది.పనులు త్వరగా పూర్తి చేస్తారు. రోజంతా ఉత్సాహభరితంగా గడుపుతారు.
మీనం రాశి:
అనుకున్న కార్యాలు, పనులు నెరవేరుతాయి. మీ చుట్టూ ఉన్న బంధు మిత్రులు,అధికారుల సహాయంతో ఫలితాలు సాధిస్తారు. ఏ రాశి వారు శ్రీరాముణ్ణి పూజించడం వలన మరింత శుభా ఫలితాలు పొందుతారు.
మకర రాశి:
ముఖ్యమైన పనుల్లో, వ్యవహారాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతమేర ఒత్తిడికి, భయాందోళనంకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు శని ని పూజించడం ద్వారా మేలు జరుగుతుంది.
కుంభం రాశి:
చేస్తున్న పనుల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా ముందడుగు వెయ్యండి విజయం సాధిస్తారు. ఆత్మ విశ్వాసంతో మరింత ముందుకు వెళతారు. ఈ రాశి వారు ఆంజనేయస్వామి వారిని పూజించడం మరీ మంచిది.
కర్కాటక రాశి:
ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రుణాలు చేసే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రమాదం జరిగియే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టవలసిన బాధ్యతల గురించి బంధువులు గుర్తు చేస్తారు.
కన్య రాశి:
అనుకోకుండా ఒక విషయం వలన ఇంట్లో విబేధాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగాలవారు జాగ్రత్తగా అడుగులు వేయవలసిన సమయం ఇది. మీ మంచి వ్యక్తిత్వం, తెలివి తేటలవనే మీకు మరింత పేరు వస్తుంది. అనుకున్న పన్నులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అధిక శ్రమ అవసరం.
ధనుస్సు రాశి:
వ్యాపార రంగాలవారికి అనుకున్నంతగా కలసిరాకపోవచ్చు, అధిక శ్రమ వలన మీరు అలసి పోతారు, పనులకి విరామం ఇవ్వడం మంచిది, మానసిక ప్రశాంతత కోసం దానం వంటివి చెయయడం మంచిది.
End of Article