టీ20 ప్రపంచకప్‌ 2022 రెండో సెమీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (40 బంతుల్లో 50) సమయోచిత బ్యాటింగ్‌కు హార్దిక్ పాండ్య (33 బంతుల్లో 63) మెరుపులు తోడవడంతో భారత్ ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరు ఉంచింది. ఓ దశలో 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసిన భారత్.. పాండ్య దూకుడుతో చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు రాబట్టింది.

Video Advertisement

గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. 5 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌..‌ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో రోహిత్, కోహ్లి ఆచితూచి ఆడారు.

memes on india-england match..
బట్లర్ బౌలింగ్‌లో వరుసగా ఓ సిక్స్, ఫోర్ బాదిన సూర్య (10 బంతుల్లో 14).. అదిల్ రషీద్ వేసిన మరుసటి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి.. సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 11.2 ఓవర్లలో 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి.. సెమీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత్ 15 ఓవర్లలో 100 పరుగులు చేసింది.

19వ ఓవర్లో పంత్ ఓ ఫోర్ బాదగా.. రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన హార్దిక్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్లో 20 పరుగులు రాగా.. చివరి ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాదిన హార్దిక్.. చివరి బంతికి హిట్ ది వికెట్ అయ్యాడు. ఆ ఓవర్లో 12 పరుగులు రాగా.. భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివరి 18 బంతుల్లోనే హార్దిక్ 50 రన్స్ చేయడం విశేషం.

memes on india-england match..

భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లీష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (86), జోస్ బట్లర్ (80) భారత బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఈ ఇద్దరు 10కి పైగా రన్ రేట్ మెయిటైన్ చేస్తూ పరుగులు చేశారు. దాంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఇక ఫైనల్లో పాక్‌ను ఇంగ్లండ్ ఢీ కొట్టనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

 

ఈ మ్యాచ్ పై నెట్టింట మీమ్స్ వైరల్  అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on india-england match..
#2

memes on india-england match..
#3

memes on india-england match..
#4

memes on india-england match..
#5

memes on india-england match..
#6

memes on india-england match..
#7

memes on india-england match..
#8

memes on india-england match..
#9

memes on india-england match..
#10

memes on india-england match..
#11

memes on india-england match..
#12

memes on india-england match..
#13

memes on india-england match..
#14

memes on india-england match..
#15

memes on india-england match..
#16

memes on india-england match..
#17

memes on india-england match..
#18

memes on india-england match..
#19

memes on india-england match..
#20

memes on india-england match..
#21

memes on india-england match..
#22

memes on india-england match..

#23

memes on india-england match..