టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది.
Video Advertisement
దీంతో సౌతాఫ్రికా.. గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకూ 3 మ్యాచ్‌లు ఆడగా.. జింబాబ్వేతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. బంగ్లా, భారత్‌లపై వరుస విజయాలు సాధించిన సఫారీ జట్టు 5 పాయింట్లతోపాటు మెరుగైన రన్‌రేట్‌తో నంబర్ వన్‌గా నిలిచింది. భారత్ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. 4 పాయింట్లతో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే (3 పాయింట్లు), పాకిస్థాన్ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
భారత్ ఓటమి తర్వాత ప్రస్తుతం పాక్ జట్టుకు ఇబ్బందులు తలెత్తాయి. దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే, బాబర్ సేన ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ ఓడించినా.. నెదర్లాండ్స్‌తోనూ దక్షిణాఫ్రికా ఆడాల్సి ఉన్నందున అది కష్టమేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలిస్తే 7 పాయింట్లు దక్కుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఆరు పాయింట్లను మాత్రమే చేరుకుంటుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓడి నెదర్లాండ్స్‌పై గెలిస్తే.. టీమిండియా, సౌతాఫ్రికా రెండూ సెమీస్ చేరతాయి. మిగతా జట్లు ఇంటి ముఖం పడతాయి.
ఈ నేపథ్యం లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఎలా అంటూ నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23