బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడుతోంది భారత్. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్ క్లీన్ స్వీప్ కాకుండా ఉంటానికి ప్రయత్నిస్తోంది. దీని తర్వాత ఇండియా ఈ నెల 14 నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే టీ 20 ప్రపంచ కప్ సమయం నుంచి భారత్ బాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. ముగ్గురు ఆటగాళ్లకు గాయాలవ్వడం, బౌలర్లు పేలవ ప్రదర్శన, ఫామ్లేని బ్యాటర్లు, ఇలా అన్ని సమస్యలతో భారత జట్టు ఇబ్బంది పడుతోంది.

Video Advertisement

అయితే మూడో వన్డే లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ.. మూడో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్‌ స్థానంలో చివరి వన్డేలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడిస్తున్నట్లు తెలిపిన రాహుల్.. దీపక్ చాహర్ బదులు కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించుతున్నట్లు తెలిపాడు.

memes on india- bangladesh match..

ఇన్నింగ్స్‌ ప్రారంభంలో ఇషాన్‌ కిషన్‌తో కలిసి వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ అర్ధసెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. తద్వారా మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఓవరాల్‌గా 113 పరుగులు చేసిన కోహ్లీ భారీ షాట్‌ కు యత్నించి ఔటయ్యాడు.

memes on india- bangladesh match..

ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ అజేయమైన 210 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కోహ్లీ తన 72 వ సెంచరీ తో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన వారిలో రెండో స్థానానికి చేరాడు. అయితే ఈ మ్యాచ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on india- bangladesh match..
#2

memes on india- bangladesh match..
#3

memes on india- bangladesh match..
#4

memes on india- bangladesh match..
#5

memes on india- bangladesh match..
#6

memes on india- bangladesh match..
#7

memes on india- bangladesh match..
#8

memes on india- bangladesh match..
#9

memes on india- bangladesh match..
#10

memes on india- bangladesh match..
#11


#12

#13


#14


#15


#16


#17


#18