Ads
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలకు లక్నో జట్టు బ్రేక్ వేసింది. 4 సంవత్సరాల తరువాత సొంతగడ్డ పై మ్యాచ్ ఆడిన రాజస్థాన్ రాయల్స్‌కు మొదటి పోరులోనే లక్నో చేతిలో ఓటమి ఎదురైంది.
Video Advertisement
బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుతో చివరి వరకు ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేజేతులా ఓటమి పాలయ్యింది. లక్నో జట్టు బౌలర్ల సమిష్టి ఆటతో 10 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు పై విజయం సాధించింది.
మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసి, 154 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు మ్యాచ్ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఐపీఎల్ 16 సీజన్ లో టాపర్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పై లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాజస్తాన్ జట్టులో ఓపెనర్లు బట్లర్ 40, యశస్వి జైస్వాల్ 44, కెప్టెన్ సంజూ శాంసన్ 2, రానౌట్, హెట్‌మైర్ 2, దేవదత్ పడిక్కల్ 26, రియాన్ పరాగ్ 15 నాటౌట్, అవేశ్‌ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో జురెల్, పడిక్కల్ పరుగులు చేయకుండానే వరుస బాల్స్ లో ఔట్ కావడంతో లక్నో జట్టు గెలుపు ఖరారైంది. రాజస్తాన్ పై లక్నో జట్టు విజయం సాధించడం పై నెట్టింట్లో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఆ మీమ్స్ మీరు చూడండి..
1. 2. 3. 4. 5.
6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.Also Read: “ఫాఫ్ డూప్లెసిస్”… సౌత్ ఆఫ్రికా వాడు అయ్యుండి “అరబిక్” టాటూ ఎందుకు వేయించుకున్నాడో తెలుసా? వెనుక ఉన్న కథ ఇదే.!
End of Article