“ఎన్ని సీజన్స్ మారినా ఈ దరిద్రం మాత్రం మారదు..!” అంటూ… CSK Vs RCB మ్యాచ్‌లో “బెంగళూరు” ఒడిపోవడంపై 15 ట్రోల్స్..!

“ఎన్ని సీజన్స్ మారినా ఈ దరిద్రం మాత్రం మారదు..!” అంటూ… CSK Vs RCB మ్యాచ్‌లో “బెంగళూరు” ఒడిపోవడంపై 15 ట్రోల్స్..!

by kavitha

Ads

ఐపీఎల్ 16 సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 24వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెంగళూరు జట్టు పై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు దాదాపు ఓటమి అంచుల వరకూ వెళ్ళింది.

Video Advertisement

అయితే చివర్లో అద్భుతంగా పోరాడి 8 పరుగుల తేడాతో సొంత గడ్డ పైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి, విజయాన్ని అందుకుంది. బెంగళూరు జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నైజట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 226 పరుగులు స్కోర్ చేసింది. దీంతో బెంగళూర్ జట్టు ముందు 227 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు ఆటగాళ్లు చెన్నై జట్టు బౌలర్ల దాటికి నిలబడలేక వరుస వికెట్లను కోల్పోయారు.
అయితే నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన గ్లెన్ మాక్స్‌వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మాక్స్‌వెల్ తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనితో పాటు కెప్టెన్ డుప్లెసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ జంట 3వ వికెట్‌కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడిని స్పిన్నర్ థీక్షణ మాక్స్‌వెల్‌ను ఔట్ చేసి విడదీశాడు. ఆ తరువాత డుప్లెసిస్‌ని ఔట్ చేయడంతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతికి వచ్చింది.
ఈ క్రమంలో బెంగుళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలుపును అందుకుంది.  ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె 45 బంతుల్లో 83, శివమ్ దూబె 27 బంతుల్లో 52, అజింక్య రహానె 20 బంతుల్లో 37, మొయిన్ అలీ 9 బంతుల్లో 19 నాటౌట్. బెంగళూరు జట్టు బౌలర్లలో పార్నెల్, మహ్మద్ సిరాజ్,  మాక్స్‌వెల్, విజయ్ కుమార్, హసరంగ, హర్షల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇది ఇలా ఉండగా బెంగుళూర్ జటూ ఓడిపోవడం పై నెటిజెన్లు సోషల్ మీడియాలో ఎన్ని సీజన్లు మారిన ఈ జట్టు దరిద్రం మారదు అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అవి ఏమిటో మీరు చూసేయండి..

1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.

Also Read:“2016 మళ్లీ రిపీట్ అవుతుంది..!” అంటూ… KKR VS SRH మ్యాచ్ లో “హైదరాబాద్” గెలవడంపై 15 మీమ్స్..!

 


End of Article

You may also like