ఐపీఎల్ 2023 16వ సీజన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ కి దిగింది.

Video Advertisement

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. హైదరాబాద్ జట్టులో హ్యారీ బ్రూక్ ఐపీఎల్ లో మొదటి సెంచరీ చేశాడు. ఐదెన్ మార్‌క్రమ్‌ 50 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగులు, హెన్రిచ్‌ క్లాసెన్ 16 పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్‌ జట్టు ఈ సీజన్‌లోనే అత్యధికంగా 228/4 పరుగులు సాధించింది.
SRH-won-by-23-runs-on-KKR2తరువాత 229పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టులో నితీశ్‌ రాణా 75, రింకు సింగ్ 51 పరుగులతో చేశారు. ఈ మ్యాచ్ లో వరుస వికెట్లు కోల్పోతూ కోల్‌కతా జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. దాంతో కోల్ కతా జట్టుకు ఓటమి తప్పలేదు.
SRH-won-by-23-runs-on-KKR1229 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నంలో మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహ్మనుల్లా డక్ అవుట్, వెంకటేశ్ అయ్యర్ 10, ఆండ్రీ రసెల్ (3), సునీల్ నరైన్ పరుగులు ఏమి చేయకుండానే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా జట్టుని రింకు సింగ్ 58 నాటౌట్, 31 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్స్ తో రాణించాడు.కెప్టెన్ నితీశ్ రాణా 41 బంతుల్లో 5ఫోర్లు,6 సిక్సర్లతో 75 పరుగులతో గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో హైదరాబాద్ జట్టు బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా చేయడంతో సొంత గడ్డ పైనే కోల్‌కతా జట్టు ఓటమిని చవి చూసింది. ఈ సీజన్‌లో 4వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌ జట్టుకి కి ఇది రెండో విజయం, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ఇది రెండో ఓటమి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హాల్ చల్ చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1.
2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.Also Read: IPL 2023 లో అదరగొడుతున్న… ఈ “హైదరాబాద్” అబ్బాయి ఎవరో తెలుసా..?