మనకు వీడియోల్లో కనిపించే దయ్యాలు నిజమైనవేనా.? అసలు దెయ్యాలు కెమెరాకి చిక్కుతాయా..?

మనకు వీడియోల్లో కనిపించే దయ్యాలు నిజమైనవేనా.? అసలు దెయ్యాలు కెమెరాకి చిక్కుతాయా..?

by Mohana Priya

Ads

మనలో చాలా మందికి ఉండే ఫోబియా దయ్యాల భయం. దెయ్యాలు నిజంగా ఉంటాయా? ఉండవా? అనే ప్రశ్న వేస్తే, దీనిపై కొంత మంది ఉంటాయని, కొంత మంది ఉండవు అని సమాధానం ఇస్తారు. కొంత మంది మాత్రం తాము నిజంగా దెయ్యాలను చూసాము అనే చెబుతారు.

Video Advertisement

ghosts in videos

ఇదే రీతిలో కొంతమంది యూట్యూబ్ లో  దెయ్యాలను చూసాము అంటూ వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న విషయం ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు. అయితే అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ghosts in videos

#1 భూత అంటే గడిచిన కాలం అని అర్థం. ప్రాచీన గ్రంధాల ప్రకారం దెయ్యం అంటే మనిషి మరణించి, మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశ.

ghosts in videos

#2 మనలో చాలా మంది వారు నిద్రపోతున్నప్పుడు వారిపై ఏదో ఒక బరువు ఉన్నట్టుగా అనిపించింది అని, దాని వల్ల వారికి ఊపిరి ఆడలేదు అని, చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంత మంది అయితే దెయ్యం పట్టిన వాళ్ళని చూశాము అని చెబుతారు.

ghosts in videos

సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు చూసి, దెయ్యాలు నిజంగానే ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. అయితే,ఇలా ఇంటర్నెట్ లో చూసే అన్ని దెయ్యాల వీడియోస్ నిజం అవ్వాలి అనే అవసరం లేదు. మామూలుగా ఎక్కువమంది ఆసక్తికరంగా చూస్తే వాటిలో ఈ దెయ్యాల వీడియోలు ఒకటి. అందుకే కొంత మంది వ్యూస్ కోసం కూడా ఇలా దెయ్యాలు ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు.

ghosts in videos

#3 శరీరం గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని అనే పంచభూతాలతో రూపొందింది. మిగతా వాటితో పోలిస్తే మనిషిలో నీటి శాతం, మట్టి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనిషి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. దెయ్యాల విషయానికొస్తే వాటిలో వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకని అవి ఎక్కువగా కనిపించవు.

ghosts in videos

#4 కొంత మందికి మాత్రం దెయ్యాలు వేధిస్తూ ఉంటాయి. దానికి కారణం వారి జన్మ కుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండడం. అలా ఉండడం వల్ల మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు.ghosts in videos

#5 చాలా మంది దెయ్యాలను ఫోన్ లో, లేకపోతే వీడియో కెమెరాలో బంధించి తాము నిజంగా దెయ్యాలు అని చూసాము అని చెప్తూ ఉంటారు. కానీ సాధారణంగా, దెయ్యాలు మామూలు కెమెరాలకు చిక్కవు. దెయ్యాలను వీడియో తీయాలి అంటే IR కట్ ఫిల్టర్ ఉన్న ఫుల్ స్పెక్ట్రమ్ పొలరైజ్డ్ డిజిటల్ కెమెరా కావాలి.ghosts in videos

#6 చాలా మందికి నిద్రపోతున్నప్పుడు కాళ్లు చేతులు పని చేయనట్టు, ఛాతి భాగంలో నొప్పి వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల మనపై దెయ్యం ఉంది అని, లేదా మనకి దెయ్యం సోకింది ఏమో అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజం ఏంటంటే, ఒకవేళ మీరు ఎక్కువగా అలసిపోతే అలా అనిపిస్తూ ఉంటుంది.ghosts in videos

కొన్నిసార్లు అయితే, దెయ్యాలు కలలోకి వచ్చినట్టు, మనల్ని చంపుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనం షాక్ కి గురి అయినప్పుడు మనకి కాళ్లు చేతులు ఆడవు. ఇదంతా నిద్రలోనే జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం స్లీప్ పెరాలసిస్. ఇది మనం మెలకువగా ఉండడానికి నిద్రపోవడానికి మధ్యలో జరుగుతూ ఉంటుంది.

దయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయానికి వస్తే మాత్రం, కొంత మంది ఉన్నాయి అంటారు. కొంత మంది లేవు అంటారు. అంతే కానీ ఈ విషయానికి సంబంధించి ఖచ్చితమైన ఒక జవాబు మాత్రం ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు.

sourced from : Rahasyavani


End of Article

You may also like