ఎవరీ “రామానుజాచార్యులు”..? అయనకి అంత పెద్ద విగ్రహం నిర్మించడానికి గల కారణమేంటి..?

ఎవరీ “రామానుజాచార్యులు”..? అయనకి అంత పెద్ద విగ్రహం నిర్మించడానికి గల కారణమేంటి..?

by Mohana Priya

Ads

రామానుజాచార్యులకి హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల గ్రామంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారత దేశంలో రెండవ పొడవైన విగ్రహం కావడం విశేషం. అంతే కాకుండా ప్రపంచంలో 26వ పొడవైన విగ్రహం. శ్రీ వైష్ణవ పీఠాధిపతి అయిన త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని నిర్వహిస్తున్నారు.

Video Advertisement

రామానుజాచార్య హిందూ మతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో పుట్టారు రామానుజాచార్య. కాంచీపురంలో చదువుకున్నారు. శ్రీరంగం ప్రధాన కేంద్రం. ఆయన సమాధి ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో ఉంది. రామానుజాచార్య విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

unknown details about ramanujacharya

గోష్ఠీపూర్ణుడు అనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అనే ఒక నిబంధన ఉండేది. రామానుజాచార్య గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పారు. ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు చెప్పినవారు పాపాత్ములు అవుతారు అనే నిబంధనను అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకి పాపం వచ్చినా పర్వాలేదు అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు.

unknown details about ramanujacharya

ఇంకా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేశారు. అక్కడ జీయంగార్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. కులోత్తుంగ చోళుడు శైవమత భక్తితో వైష్ణవులని హింసించడంతో, అక్కడ నుండి తరలించిన ఉత్సవమూర్తులతో తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయాన్ని నిర్మించారు. కొన్ని ఆలయాల్లో దళితుల ఆలయ ప్రవేశం కోసం కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా మార్చారు. కొందరికి అర్చకత్వం అవకాశం కల్పించారు.


End of Article

You may also like