సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.

naveena reddy 1

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు. అయితే.. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మరో యాక్ట్రెస్ నవీనారెడ్డి. ఆమె ఈ సినిమాలో కొద్ది సేపే కనిపిస్తుంది. కానీ.. ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేరు. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ.. ఇది ఆమె మొదటి సినిమా మాత్రం కాదట.

naveena reddy 3

గతంలో కూడా ఆమె పలు తెలుగు సినిమాలలో నటించారు. వెంకటేష్ ఎఫ్ 2 సినిమాలో కూడా ఆమె ఓ కీలక పాత్ర పోషించారట. ఎఫ్ 2 ఆమెకు తొలి సినిమా. అద్భుతం, వెంకీ మామ, భీష్మ, హిట్ వంటి సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఈ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇవి కాకుండా.. దేవయాని, అర్థ శతాబ్దపు సినిమాలలో కూడా ఆమె సైడ్ రోల్స్ లో నటించారట.

naveena reddy 1

అయితే.. ఈ పాత్రలేవీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. తాజాగా.. అఖండ లో ఆమె పాత్రకి విశేషమైన గుర్తింపు లభిస్తోంది. నవీన రెడ్డి హైదరాబాద్ కు చెందిన అమ్మాయే. ఈమె చిరంజీవి కి పెద్ద ఫ్యాన్. ఆమెకు ఓ సోదరి కూడా ఉన్నారట. యాక్ట్రెస్ నవీన రెడ్డి సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు.