తెర మీద నవ్వులు పూయించే భరత్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? అతని లుక్ అంతలా మారడానికి కారణం అదేనా?

తెర మీద నవ్వులు పూయించే భరత్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? అతని లుక్ అంతలా మారడానికి కారణం అదేనా?

by Anudeep

Ads

చైల్డ్ ఆర్టిస్ట్ లలో బాగా గుర్తుండిపోయే పేరు మాస్టర్ భరత్. కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా తెరమీద మంచి కామెడీని పండించడంలో కూడా భరత్ దిట్ట. డైలాగ్చైల్డ్ ఆర్టిస్ట్ లలో బాగా గుర్తుండిపోయే పేరు మాస్టర్ భరత్. కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా తెరమీద మంచి కామెడీని పండించడంలో కూడా భరత్ దిట్ట. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని నవ్విస్తూ ఉంటాడు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ కాస్తా పెద్దవాడు అయ్యాడు.

Video Advertisement

అయినా కూడా, చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ చేసిన పాత్రలకి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన స్థానం ఉంది. భరత్ చేసిన కామెడీ సీన్లకి ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారంటే అదెంత మాత్రమూ అతిశయోక్తి కాదు.

రెడీ లో “చిట్టి నాయుడు” గా భరత్ పోషించిన పాత్ర బాగా హై లైట్ అయ్యింది. “వెంకీ”, “దూకుడు”, “కింగ్”, “రగడ” వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబో లో వచ్చిన బాద్ షా సినిమా టైం కి భరత్ బాగా తగ్గిపోయి సన్నగా కనిపించాడు. లాస్ట్ ఇయర్ అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఏబీసీడీ సినిమాలో కూడా భరత్ ను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.

bharath 2

భరత్ ఎందుకు ఇంత సన్నగా అయిపోయాడు అంటూ అందరు షాక్ అవుతున్నారు. ఇలా ఎందుకు అయిపోయావు? అని ప్రశ్నిస్తే భరత్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లోనే ఉన్నానని, చదువు పరంగా ఇప్పటికే మెడిసిన్ విద్యని పూర్తి చేసానని చెప్పుకొచ్చారు. మెడిసిన్ లోనే డాక్టరేట్ చేస్తున్నానని చెప్పారు. చెన్నైలో కాలేజీలో జాయిన్ అయిన కొత్తల్లో ఆక్సిడెంట్ అయ్యిందని.. దానితో అప్పటివరకు లావుగా ఉన్న నేను ఒక్కసారిగా సన్నబడిపోయానని చెప్పుకొచ్చారు.

bharath 3

కొన్నాళ్ళకి జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్న సమయంలో ఐరన్ రాడ్ కంటిలో పొడుచుకోవడంతో చూపు దెబ్బతింది. అయితే డాక్టర్ చెక్ చేసి, కంట్లో బ్లాక్ ఏర్పడింది అని, మందులు వాడితే తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికి కూడా తాను ఆ మందులు వాడుతున్నానని కానీ, ఇంకా కంటి చూపు మాత్రం పూర్తిగా మెరుగవ్వలేదని భరత్ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like