Ads
మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అవి మనం అంతగా గమనించం.. తీర తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతాం. మీరెప్పుడైనా గమనించారా..? మీ చేతి గోర్లు లేదా కాలి గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇవి శాశ్వతంగా ఉండవు. కానీ, చేతి వేళ్ళు, కాలి వేళ్ళ గోర్లకి అర్ధచంద్రాకారంలో నెలవంకను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దీనినే లునులా అంటారు.
Video Advertisement
ఇది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కానీ.. అప్పుడప్పుడు ఇలాంటి తెల్లని మచ్చలు ఎందుకు వస్తాయి.? వీటి వల్ల ఏమి జరుగుతుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాధారణంగా మన చేతి వేళ్ళకి గాని, కాలి వేళ్ళకి గాని దెబ్బలు తగిలినప్పుడు గోర్లపై ఇలా తెల్లని మచ్చలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇలా తెల్లని మచ్చలు రావడాన్ని ల్యుకోనేషియా అని పేర్కొంటారు. కేవలం దెబ్బలు తగలడమే కాకుండా.. గోళ్లపై ఇలా తెల్లని మచ్చలు రావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మన గోళ్లకు దెబ్బ తగిలినప్పుడు.. గొర్లకు ఉండే తెల్లని కుదుళ్ళ కారణంగా కూడా ఈ తెల్లని మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక కొందరి శరీరంలో కాల్షియమ్ మరియు జింక్ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే.. శరీరంలో కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవడం వల్ల కానీ, ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు ఇవి సహజంగానే వస్తుంటాయి. అయితే.. ఈ తెల్లని మచ్చలు ఎక్కువ కాలం పాటు ఉండవు. కేవలం 3 నుంచి 7 నెలల వరకు ఉండి ఆ తరువాత పోతూ ఉంటాయి. దీనివల్ల శరీరానికి ఏమి నష్టం ఉండదు. కానీ, ఇలా రావడం వల్ల మన శరీరంలో ఉన్న ఇబ్బందులు మనకి తెలుస్తూ ఉంటాయి. దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.
End of Article