టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుఝామున ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి ఢిల్లీ కి వెళ్తుండగా అతడి కార్ డివైడర్ ని ఢీకొని మాటల్లో చిక్కుకుంది. వెంటనే కార్ అద్దాన్ని పగలగొట్టుకొని పంత్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ప్రమాదం లో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయం లో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు.

Video Advertisement

 

కారు ప్రమాదం కారణంగా పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న సమీప గ్రామ ప్రజలు, పోలీసులు అతణ్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారని ప్రచారం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పంత్‌‌ను డెహ్రాడూన్‌ను తరలించారు. ఈ ప్రమాదం లో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం లో కాలిన గాయాలయ్యాయని తెలుస్తోంది. వాహమునం పై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగుండొచ్చు అని పోలీసులు వెల్లడించారు.

what happend after rishab pant met with an accident..

 

అయితే పంత్ ప్రమాదం గురించి పలు కథనాలు వెలువడుతున్నాయి. ప్రమాదానికి గురైన తర్వాత పంత్ కార్ అడ్డం పగలగొట్టుకొని రాగా.. అక్కడి స్థానికులు అతడికి సహాయం చేయకపోగా.. అతడి డబ్బు దోచుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పంథి స్వయంగా అంబులెన్సు కి కాల్ చెయ్యాల్సి వచ్చిందని రాస్తున్నారు. రిషబ్ ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడారు. వచ్చే నెలలో జరగనున్న శ్రీలంకతో టీ20 సిరీస్‌కు టీమ్‌కు ఎంపిక కాలేదు.

 

what happend after rishab pant met with an accident..
ఇక క్రిస్మస్‌ వేడుకలను పంత్‌.. మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి దుబాయ్‌లో చేసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పంత్ కార్ ప్రమాద దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు. వాటిని చూస్తుంటే పలువురు స్థానికులు అతడికి సహాయంగా ఉంది బ్లాంకెట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. పంత్ ఆస్పత్రిలో చేరే సరికి పూర్తి స్పృహ లో ఉన్నట్లు అక్కడి డాక్టర్ వెల్లడించారు. ఈ ప్రమాదం పై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు స్పందించి.. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.