సినిమాల్లో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం కరెక్టేనా.? ఇదే పని విలన్ చేస్తే.?

సినిమాల్లో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం కరెక్టేనా.? ఇదే పని విలన్ చేస్తే.?

by Mohana Priya

Ads

సినిమా అనేది పేరుకి మాత్రమే ఎంటర్టైన్మెంట్. కానీ చాలా మందికి ఇది ఒక ఎమోషన్. ముఖ్యంగా భారత దేశ ప్రజలకు అయితే సినిమాతో చాలా విడదీయరాని అనుబంధం ఉంది. ఎంతోమంది సినిమాలను చూసి స్ఫూర్తి  చెంది ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అందులో చాలా వరకు మంచి పనులు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం అనవసరమైన విషయాలు ఉంటాయి. వాటిని ఎంతో మంది చూసి ఇన్స్పైర్ అయ్యి నిజజీవితంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

Video Advertisement

what if the villain do the same thing in movies

ఒకవేళ హీరోనే అలాంటి పనులు చేస్తే అది కరెక్ట్ ఏమో అనుకుంటారు. తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బాహుబలి కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూపించింది. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ లో కూడా ఇలాంటి సన్నివేశం ఉంటుంది. అంతే కాకుండా రామ్ పోతినేని హీరోగా నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో కూడా హీరోయిన్ తన ఊరి గురించి మాట్లాడినందుకు హీరో, హీరోయిన్ ని ఎంత ఇబ్బందికి గురి చేస్తాడో కూడా మనం చూశాం.

what if the villain do the same thing in movies

సాధారణంగా అదే పని ఒక విలన్ చేసినట్టు చూపిస్తే ,సినిమాలో హీరో వెళ్ళి ఆ విలన్ ని కొట్టి, హీరోయిన్ కి సారీ చెప్పిస్తాడు. కానీ ఒక సినిమాలో హీరోనే అలా ప్రవర్తిస్తే అది కరెక్ట్ అని అంటారు. అంతేకాదు చాలా సినిమాల్లో హీరో హీరోయిన్ చేత ఐ లవ్ యు చెప్పించుకోవడానికి సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం, లేకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకేస్తానని చెప్పడం చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి ఐ లవ్యూ చెప్పేస్తుంది.

what if the villain do the same thing in movies

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. కేవలం హీరోయిన్లతో ఇలా ప్రవర్తించడం మాత్రమే కాదు. ఇంకా హీరో ఎన్నో తప్పుడు పనులు చేస్తాడు. హీరో పాత్ర అంటే ప్రతి సారి కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేసే తప్పుని కూడా కరెక్ట్ అని చూపించడం వల్ల జనాల్లో ఎంతో కొంత వరకు ప్రభావం పడుతోంది. ఇది కేవలం తెలుగు సినిమాకి మాత్రమే వర్తించదు. భారతీయ సినిమాలో ఇలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఇంక ముందు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక ప్రేక్షకుడు ఆ సీన్స్ రిసీవ్ చేసుకునే విధానం మాత్రం కాలక్రమేణా మారుతుందేమో.


End of Article

You may also like