ఎండాకాలంలో ఏసీ కొనుగోలు చేస్తున్నారా..? ఇన్వెర్టర్ ఏసీకి, నాన్ ఇన్వెర్టర్ ఏసీకి తేడా ఏంటో తెలుసా..?

ఎండాకాలంలో ఏసీ కొనుగోలు చేస్తున్నారా..? ఇన్వెర్టర్ ఏసీకి, నాన్ ఇన్వెర్టర్ ఏసీకి తేడా ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

ఎండలు ముదురుతున్నాయి. మార్చి లోనే భానుడు తీవ్రంగా ప్రతాపం చూపించేస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ముదురుతున్న రోజుల్లోనే మనకి ఏసీ గుర్తొస్తుంది. ఇంట్లో అయినా.. కార్యాలయాల్లో అయినా ఈ ఎండ తాకిడి నుంచి తప్పించుకోవడానికి ఏసీనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఏసీ కొనాలని అనుకుంటున్నారా..?

Video Advertisement

అయితే.. ఎసిలలో ఇన్వెర్టర్ ఏసీ మరియు నాన్ ఇన్వెర్టర్ ఏసీల మధ్య తేడాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. అంతే కాదు.. వీటిల్లో ఏది బెస్ట్ అన్నది తెలుసుకోండి కొత్త ఏసీలను కొనుక్కోవాలి.

ac 1

ముందుగా.. ఇన్వెర్టర్ ఏసీ మరియు నాన్ ఇన్వెర్టర్ ఏసీల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఎసిలలో ఇన్వెర్టర్ టెక్నాలజీ ఇన్ బిల్ట్ గా వస్తే దానిని ఇన్వెర్టర్ ఏసీ అని అంటారు. ఈ టెక్నాలజీ ఉన్న ఏసీలలో కూలింగ్ కోసం వాడుకునే పవర్ సరఫరా పైన అదుపు ఉంటుంది. కూలింగ్ ఎఫెక్ట్, మరియు ఏసీలోని కంప్రెజర్ పై పూర్తి కంట్రోలింగ్ ఉంటుంది. ఈ ఏసీలలో అవసరాన్ని బట్టి టెంపరేచర్ ను చేంజ్ చేసుకోగలిగే కంప్రెజర్ ఉంటుంది. ఏసీ ఆన్ చేసి ఉన్నంత సేపు కంప్రెజర్ ఆన్ లోనే ఉంటుంది.

ac 2

అవసరాన్ని బట్టి టెంపరేచర్ ను మార్చుతూ కంప్రెజర్ రన్నింగ్ లోనే ఉంటుంది. దీనివల్ల కంప్రెజర్ ఎక్కువ విద్యుత్ ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నాన్ ఇన్వెర్టర్ ఏసీలలో ఇన్వెర్టర్ టెక్నాలజీ ఉండదు. ఫలితంగా.. కంప్రెజర్ పై అదుపు ఉండదు. దీనితో.. ఒక టెంపరేచర్ ను సెట్ చేయగానే.. ఆ టెంపరేచర్ వద్ద కంప్రెజర్ ఆఫ్ అయిపోతుంది. తిరిగి టెంపరేచర్ ను మార్చుకున్నప్పుడు ఈ కంప్రెజర్ మళ్ళి ఆన్ అయ్యి.. టెంపరేచర్ ను మార్చుతుంది. ఇలా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడల్లా.. ఈ కంప్రెజర్ ఆన్ మరియు ఆఫ్ అవుతూ ఉంటుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. అదే ఇన్వెర్టర్ ఏసీలలో ఈ ఇబ్బంది ఉండదు కాబట్టి తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.

ac 3

ఎక్కువ కాలం ఏసీని వాడదల్చుకున్నప్పుడు ఇన్వెర్టర్ ఏసీలను ఎంచుకోవడమే ఉత్తమం. నాన్ ఇన్వెర్టర్ ఏసీల ధరలతో పోలిస్తే.. ఇన్వెర్టర్ ఏసీల ధరలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ.. ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. విద్యుత్ ను కూడా ఆదా చేస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించే ఏసీలను కొనుగోలు చేసేటప్పుడు నాన్ ఇన్వెర్టర్ ఏసీలను ఎంచుకోవాలి.


End of Article

You may also like