Ads
ఎర్రకోట గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాజధాని షాజహానాబాద్ యొక్క ప్యాలెస్ ను కోటగా నిర్మించారు. దానినే మనం ఇప్పుడు ఎర్ర కోట అని పిలుస్తున్నాం. పటిష్టమైన గోడలతో నిర్మించబడి ఉండడం ఎర్ర కోట ప్రత్యేకత. ఈ కోటని నిర్మించడానికి దాదాపు పదేళ్ల కాలం పట్టింది. 1638 మరియు 1648 కాలం లో ఈ కోట నిర్మాణం జరిగింది.
Video Advertisement
ఎర్ర రంగులో ఉండే ఈ కోటని రెడ్ ఫోర్ట్ లేదా ఎర్ర కోట అని పిలుచుకుంటూ ఉంటాం. కానీ, ఈ ఎర్ర కోట అసలు రంగు ఎరుపు కాదు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎర్ర కోట అసలు రంగు ఏంటో.. ఎరుపు రంగులోకి ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
1648లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కోటను నిర్మించారు. ఈ కోటని ఇసుక రాళ్లతో, తెలుపు రంగులో నిర్మించారు. అప్పట్లో ఈ కోటని “ఖిలా-ఎ-ముబారక్” అని పిలిచేవారు. ఆ తరువాత కాలంలో దీనిని బ్లెస్సెడ్ ఫోర్ట్ (blessed fort) అని పిలవడం ప్రారంభించారు. ఆ తరువాత కాలంలో ఈ కోట రంగుతో పాటు పేరు కూడా మారిపోయింది. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కూడా 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఎర్ర కోట ఒకప్పుడు తెల్లగా ఉండేదని కనుగొంది.
1857లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ పదవీచ్యుతుడైన తర్వాత మరియు భారతీయ తిరుగుబాటును అణిచివేసిన తర్వాత కోటను ఆక్రమించుకున్న బ్రిటిష్ సైనిక అధికారులు ఈ కోటని బ్యారక్‌గా ఉపయోగించుకున్నారు. అయితే.. తెల్లగా ఉండే ఇసుక రాళ్లు పాడవుతున్నప్పుడు బ్రిటిష్ వారు దీనిని పునరుద్ధరించడం కోసం దీనిపై ఎరుపు రంగు పెయింట్ ను వేయించారు. అప్పటి నుంచి ఇది రెడ్ ఫోర్ట్ గా పిలవబడుతోంది.
End of Article