టివి స్క్రీన్ పై ఈ నంబర్లని ఎప్పుడైనా చూసారా..? ఇవి ఎందుకు ఉంటాయి? వీటి వెనుక అర్ధం ఏంటంటే..?

టివి స్క్రీన్ పై ఈ నంబర్లని ఎప్పుడైనా చూసారా..? ఇవి ఎందుకు ఉంటాయి? వీటి వెనుక అర్ధం ఏంటంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం ఓటిటిల హవా కొంచం ఎక్కువగానే నడుస్తోంది. అయినప్పటికీ ఫ్యామిలీలో టివి కి ఉండే ప్రాధాన్యత తగ్గేదేమీ కాదు. ఇంట్లో నలుగురు కలిసి సరదాగా టివి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే టివి లలో వచ్చే ఛానెల్స్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్, సినిమాలతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనీ భావిస్తూ ఉంటాయి.

Video Advertisement

tv screen 1

అయితే.. బుల్లితెరకు కూడా ప్రధానంగా ఎదురయ్యే సమస్య పైరసీ. టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ ను ఎవరైనా రికార్డు చేసి ఇతర వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు బుల్లితెరకు కూడా తప్పడం లేదు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలం లో ఇలాంటి సమస్యలను అధిగమించడానికే టివి లపై ఇలాంటి నెంబర్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేసారు.

tv screen 2

ఈ నంబర్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఏ రెండు టీవీలకు ఒకే నెంబర్ ఉండదు. ఎందుకంటే ప్రతి సెట్-టాప్ బాక్స్ డిఫరెంట్ గానే ఉంటుంది. అందరికి వేరు వేరు సెట్-టాప్ బాక్స్ లు ఉంటాయి కాబట్టి ఈ నంబర్లు కూడా వేరుగా ఉంటాయి. ఈ నెంబర్ ని VC నెంబర్ లేదా కార్డు నెంబర్ అని పిలుస్తారు. ఈ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉండడం వలన ఎవరైనా వీడియోని కానీ, ఇతర ప్రోగ్రామ్స్ ని కానీ రికార్డు చేసి యు ట్యూబ్, ఫేస్ బుక్ వంటి ఇతర సోషల్ మీడియా సైట్లలో ఉంచితే ఆ నెంబర్ కూడా రికార్డు అయ్యి డిస్ప్లే అవుతుంది.

tv screen 3

అప్పుడు ఆ వీడియో పై డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఎవరు ఈ పైరసీ కి పాల్పడ్డారో తెలిసిపోతుంది. ఈ నెంబర్ కి ప్రత్యేకమైన సెట్-టాప్ బాక్స్ ఐడి ఉంటుంది. అందులో వినియోగదారుల పేరు, చిరునామా వంటి సమాచారం ఉంటుంది. కాబట్టి ఎవరు పైరవీకి పాల్పడినా ఆ విషయం సులువుగా తెలుసుకుని..అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. అందుకోసమే ఈ నెంబర్ ను టీవీ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తూ ఉంటారు.


End of Article

You may also like