సింక్ లో ఈ హోల్ ఎందుకు ఉంటుంది..? దీని వల్ల ఈ ఉపయోగం ఉంటుంది అని అస్సలు ఉహించి ఉండరు..!

సింక్ లో ఈ హోల్ ఎందుకు ఉంటుంది..? దీని వల్ల ఈ ఉపయోగం ఉంటుంది అని అస్సలు ఉహించి ఉండరు..!

by Anudeep

Ads

సింక్ అనేది ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతి దానికి బయటకు వెళ్లి టాప్ తిప్పితే.. ఆ వాటర్ పడి మన బట్టలు పాడైపోకుండా ఉండడానికి ఇంట్లోనే ఓ పక్కన సింక్ కట్టించేసుకుంటూ ఉంటాం. దీనివలన మన పని కూడా సులువు అయిపోతుంది.

Video Advertisement

sink basin hole

అలాగే.. కిచెన్ లో కూడా మనం సింక్ ని తప్పనిసరిగా పెట్టించుకుంటాం. ప్రతి మోడరన్ ఇంట్లోనూ సింక్ అనేది కామన్ అయిపొయింది. అయితే.. మీరు ఎప్పుడైనా గమనించారా?`సింక్ కి మధ్యలో హోల్స్ ఉంటాయి. మనం ఉపయోగించిన నీరు కిందకి వెళ్లిపోవడానికి ఈ ఏర్పాటు చేస్తారు. కానీ టాప్ కి.. ఈ సెంట్రల్ హోల్ కి మధ్యలో మరొక హోల్ ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని గమనించారా? దీని ఉపయోగం ఏంటో తెలుసా..?

sink basin hole

ఈ హోల్ వలన రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేమిటంటే.. డ్రెయిన్ స్టాపర్‌తో ఓవర్‌ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఈ హోల్ అవసరం అవుతుంది. ఈ హోల్ ద్వారా కొంత గాలి లోపలకి ప్రసరించి సింక్ లో పడిన నీరు త్వరగా కిందికి పడిపోవడానికి ఉపయోగపడుతుంది. దీనివలన నీరు పోవడానికి ఇవ్వబడిన పైప్ సక్రమం గా పని చేస్తూ ఉంటుంది. నిజానికి ఇది చాలా చిన్న విషయమే.. కానీ మనం మన చుట్టూ పరిసరాలలో ఉండే విషయాలను చాలా వరకు పట్టించుకోము. జాగ్రత్తగా పరిశీలిస్తే.. ప్రతి చిన్న వస్తువు వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటూనే ఉంటుంది.


End of Article

You may also like