ఎవరైనా మరణించాక.. వారి పాస్ పోర్ట్, పాన్ కార్డులని ఏమి చేస్తారో తెలుసా..? ఈ పని మాత్రం కచ్చితంగా చేయాలి..!

ఎవరైనా మరణించాక.. వారి పాస్ పోర్ట్, పాన్ కార్డులని ఏమి చేస్తారో తెలుసా..? ఈ పని మాత్రం కచ్చితంగా చేయాలి..!

by Anudeep

Ads

ప్రతి దేశంలో ప్రజలకు గుర్తింపు కార్డులు లేదా ఐడెంటిటీ కార్డులు కచ్చితంగా ఉంటాయి. అలాగే.. మన దేశంలో కూడా భారతీయులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ వంటివి మన ఐడెంటిటీ గా ఉంటాయి. ప్రతి మనిషికి ఎక్కడకి వెళ్లాలన్నా.. లేదా ప్రభుత్వ పధకాల నుంచి ఎటువంటి లబ్ది పొందాలన్నా ఈ కార్డులు తప్పనిసరి.

Video Advertisement

అయితే.. మనిషి చనిపోయిన తరువాత.. ఈ కార్డులను ఏమి చేయాలి..? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి ఉంటుంది. కానీ, మనిషి చనిపోయాక ఈ కార్డులు ఏమవుతాయి. వీటిని కుటుంబ సభ్యులే జాగ్రత్త చేయాల్సి ఉంటుంది.

pan adhar 1

ప్రభుత్వ స్కీం లకు అవసరమయ్యే ఈ డాకుమెంట్స్ ను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే.. అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనిషి చనిపోయాక సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఇటువంటి ఐడెంటిటీ కార్డులను రద్దు చెయ్యాలి. లేదంటే.. మనిషి చనిపోయినా ఈ డాకుమెంట్స్ ని భద్రపరచాల్సి ఉంటుంది.

pan adhar 2

ఒక పరిమిత కాలం తరువాత పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేయించుకోకపోతే అది రద్దు అవుతుంది. అప్పటివరకు పాస్ పోర్ట్ ని జాగ్రత్త చేయాలి. అది రద్దు అయిపోయాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఫారం సెవెన్ ను ప్రభుత్వ కార్యాలయాల్లో అప్లై చేసుకుంటే.. ఓటర్ ఐడి ని కూడా రద్దు చేస్తారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా.. కొత్త ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ఈ డాకుమెంట్స్ ను తప్పనిసరిగా రద్దు చేయడమో.. లేక జాగ్రత్తగా భద్రపరచడమో చేయాలి.


End of Article

You may also like