Ads
ఈ తరంలో అన్ని అనుభవాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రేమ, కోపం, తాపం, ఆవేశం ఇలా అన్ని వేగంగా వచ్చి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి రాపిడ్ మూమెంట్స్ లో బంధాల్లో ప్రేమ మీ గుండెల్లో నిలిచి ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు బ్యాలెన్స్ కన్నా గుండెల్లో ప్రేమ బ్యాలెన్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటేనే రిలేషన్ షిప్స్ నిలబడతాయి.
Video Advertisement
లేదంటే చిన్న చిన్న విషయాలకే మానవ సంబంధాలు తెగిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారు, అదేవిధంగా వైవాహిక జీవితం అనంతరం భార్యభర్తలు మనస్పర్థలతో బంధాలను తెంచుకుంటున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిదాని వెనుక ఓ కారణం ఉంటుంది.
సంబంధం ఏర్పడటానికైనా.. క్షీణించడానికైనా అదే మూల కారణంగా మారుతుంది. అబ్బాయిల చిన్న చిన్న తప్పులు ఎక్కువగా ఉంటాయి. అబ్బాయిలు చేసే ఎలాంటి తప్పుల వల్ల వారి ప్రేమ సంబంధాలు చెడిపోతాయో ఇప్పుడు తెలుసుకోండి. ఎలాంటి తప్పుల వల్ల రిలేషన్ షిప్స్ దూరమవుతాయో చూద్దాం..
Also Read: ది లెజెండ్ సినిమాలో “శరవణన్” తో నటించడానికి… ఈ హీరోయిన్‌కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా..?
#1. ఇతర అమ్మాయిలతో ఎక్కువగా కలిసిపోకండి:
అందరూ కాదు.. కానీ చాలా మంది అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్ వేరే అమ్మాయిని అలరించడం, మాట్లాటాన్ని ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో మీ స్నేహితుల సర్కిల్‌లోని ఇతర అమ్మాయిలతో ఫ్రాంక్‌గా ఉండటానికి ప్రయత్నిస్తే, అది మీ స్నేహితురాలిని బాధపెడుతుంది. కాబట్టి మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే అలాంటి వాటికి దూరంగా ఉందండి.
#2. గౌరవం:
పురుషుడైనా, మహిళలైన అందరికీ గౌరవం ఇవ్వాలి. పొగడకపోయినా.. కనీసం ఎదుటివారి ముందు అవమానించకూడదు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఇతరుల ముందు ఏదో ఒకటి మాట్లాడటం వల్ల.. మీ భాగస్వామికి అవమానం కలుగవచ్చు. అలాంటి తప్పులు మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. కావున మీ భాగస్వామిని తప్పనిసరిగా గౌరవించండి.
#3. చిన్నపిల్లల చర్యలు:
రిలేషన్ షిప్ ప్రారంభంలో.. అమ్మాయిలతో స్నేహం చేసే సమయంలో చిన్నపిల్లల చేష్టల కారణంగా ఇబ్బంది కలగొచ్చు. ఇలాంటి చర్యల వల్ల వారికి బాధకలిగించే అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి తన భాగస్వామి మెచ్యూర్డ్ బిహేవియర్ కోరుకుంటుంది. కాబట్టి మీ భాగస్వామితో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
Also Read: “కార్తికేయ-2” సెన్సార్ రివ్యూ.! సినిమా గురించి ఏం చెప్పారంటే..?
End of Article