దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. రక్తం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిన భారత జాతీయ ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ.

Video Advertisement

 

 

మహాత్మా గాంధీ జీవితం స్వతహాగా స్ఫూర్తిదాయకం. 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ పోర్బందర్ లో పుట్టారు. ఆయన తండ్రి పోర్బందర్లో రాజకీయ నాయకుడు, తల్లి పుతలీ బాయి గృహిణి. గాంధీజీ 19 ఏళ్ల వయసులో బారిష్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత గాంధీజీ న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇందులో భాగంగానే గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లారు. గాంధీజీకి చిన్నతనంలోనే వివాహం జరిగింది.

what mahatma gandhi's descendants are doing now..!!

రికార్డుల ప్రకారం, గాంధీజీ కుటుంబ సభ్యులు మొత్తంగా 154 మంది ఉన్నారు, వీరంతా ప్రపంచ వ్యాప్తంగా ఆరు (6) విభిన్న దేశాలలో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం గాంధీజీ వంశస్తులు ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

what mahatma gandhi's descendants are doing now..!!

గాంధీజీ కి నలుగురు మగ పిల్లలు. హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రాందాస్ గాంధీ,  దేవదాస్ గాంధీ. వీరి పిల్లల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

#1 అరుణ్ గాంధీ

మహాత్మాగాంధీ రెండవ కుమారుడైన మణిలాల్ గాంధీ కుమారుడు అరుణ్ గాంధీ. ఈయన 1934 ఏప్రిల్ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించారు. ఈయన సునంద అనే ఆమెను వివాహం చేసుకోగా కుమారుడు తుషార్ గాంధీ, కుమార్తె అర్చన ఉన్నారు. ఈయన ఇటీవలే మరణించారు. ఈయన మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడిచి సామజిక కార్యకర్తగా పని చేసారు.

what mahatma gandhi's descendants are doing now..!!

#2 కాను గాంధీ

రామ్ దాస్ గాంధీ కుమారుడు కాను గాంధీ. ఈయన ఒక శాస్త్రవేత్త. అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు.

what mahatma gandhi's descendants are doing now..!!

#3 రాజమోహన్ గాంధీ

దేవదాస్ గాంధీ, లక్ష్మి దంపతుల కుమారుడు రాజమోహన్ గాంధీ. ఈయన ఒక ప్రొఫెసర్. రాజ్‌మోహన్ గాంధీ ఉషను వివాహం చేసుకున్నారు. వీరికి సుప్రియ, దేవదత్త అనే ఇద్దరు పిల్లలు.

what mahatma gandhi's descendants are doing now..!!

#4 గోపాల కృష్ణ గాంధీ

దేవదాస్ గాంధీ, లక్ష్మి దంపతుల మరో కుమారుడు గోపాల కృష్ణ గాంధీ. ఈయన చాలా కాలం దౌత్యవేత్తగా పని చేసారు. పశ్చిమ బెంగాల్ 22 వ గవర్నర్ గా కూడా పని చేసారు. ఈయన తారా గాంధీ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

what mahatma gandhi's descendants are doing now..!!

#5 రామ చంద్ర గాంధీ

దేవదాస్ గాంధీ, లక్ష్మి దంపతుల మరో కుమారుడు రామచంద్ర గాంధీ. ఈయన పలు విశ్వ విద్యాలయాల్లో బోధకుడిగా పని చేసారు. ఈయనకు లీలా గాంధీ అనే కుమార్తె ఉంది.

what mahatma gandhi's descendants are doing now..!!

#6 తుషార్ గాంధీ

మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ. ఈయన ప్రస్తుతం ముంబై లో నివాసం ఉంటున్నారు. 1985లో సోనాల్ దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు వివాన్ గాంధీ, కూతురు కస్తూరి గాంధీ ఉంది.

what mahatma gandhi's descendants are doing now..!!

#7 శాంతి గాంధీ

మహాత్మా గాంధీ మనవడు కాంతిలాల్ గాంధీ కుమారుడు శాంతి గాంధీ. ఈమె అమెరికన్ కార్డియోవాస్కులర్, థొరాసిక్ సర్జన్. అలాగే అమెరికా లోని కాన్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ సభ్యుడు.

what mahatma gandhi's descendants are doing now..!!

#8 ఎలా గాంధీ

మహాత్మాగాంధీ రెండవ కుమారుడైన మణిలాల్ గాంధీ కుమార్తె ఎలా గాంధీ. ఈమె ఒక రాజకీయ నాయకురాలు. ఒక సామజిక కార్యకర్త కూడా. ఈమె దక్షిణాఫ్రికా లో నివాసం ఉంటున్నారు.

what mahatma gandhi's descendants are doing now..!!

#9 కీర్తి మీనన్

మహాత్మా గాంధీ మనవరాలు సీత కుమార్తె కీర్తి మీనన్. ఈమె దక్షిణాఫ్రికాలోని గాంధీ సెంటెనరీ కమిటీ ఛైర్మన్. ఈమెకు ఒక కుమార్తె.

what mahatma gandhi's descendants are doing now..!!

#10 లీలా గాంధీ

మహాత్మా గాంధీ మనవడు రామ చంద్ర గాంధీ కుమార్తె లీలా గాంధీ. ఆమె ప్రస్తుతం జాన్ హాక్స్ హ్యుమానిటీస్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

what mahatma gandhi's descendants are doing now..!!

Also read: స్వాతంత్ర సమరయోధుడు “మహాత్మ గాంధీ” రాసిన లెటర్ చూశారా..? అందులో ఏం రాసి ఉందో తెలుసా..?