ప్రధాని నరేంద్ర మోడీ వాడే మొబైల్స్ ఏంటో తెలుసా..? దేనికోసం ఏ మొబైల్ ని వాడతారు అంటే..?

ప్రధాని నరేంద్ర మోడీ వాడే మొబైల్స్ ఏంటో తెలుసా..? దేనికోసం ఏ మొబైల్ ని వాడతారు అంటే..?

by Anudeep

Ads

పొద్దున్న లేస్తే మనకి వెంటనే మొబైల్ కనిపించకపోతే విసుగు వచ్చేస్తుంది. మనం వాడే ఒక్కగానొక్క మొబైల్ విషయంలో మనం అంత అట్టాచ్డ్ గా ఉంటాం. మరి.. సవాలక్ష పనులు చేసుకునే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొబైల్ విషయంలో ఇంకెంత శ్రద్ధగా ఉంటారు..? ఆయన ఎలాంటి ఫోన్స్ ని ఎంచుకుంటారు..?

Video Advertisement

మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా..? దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ మొబైల్ ను వాడతారు..? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ప్రధాని వాడే మొబైల్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

దేశ ప్రధాని కాబట్టి.. ఆయన మొదట తన భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆయన మన ప్రధాని కాబట్టి ఆయన ధరించే దుస్తులు నుండి ఉండే చోటు వరకు, మనలో కొంతమందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇప్పటికే గమనించి ఉంటె.. ఆయన రకరకాల మొబైల్స్ ను వాడడం మీరు చూసే ఉంటారు. ఆయన ఎక్కువగా ఐఫోన్ లోనే వివిధ రకాల మోడల్స్ ను వాడుతూ కనిపిస్తారు.

ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ సమయాల్లో.. ఆయన ముఖ్య వ్యక్తులతో సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు మనం గమనించవచ్చు. ఆయన ఫోటోలు తీసుకోవడం కోసం ఎక్కువగా ఐఫోన్ నే వినియోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి ఆయనకు అనుమతి లేదు. ఆయన ఫోన్ లో కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. బహిరంగ సభలలో ఫోటోలు తీసుకోవడం కోసమే ఆయన ఐఫోన్ ను వాడుతూ ఉంటారు.

pm modi 3

ఇక ఆయన సోషల్ మీడియా ఖాతాలను చూడడానికి ఆయనకు ప్రత్యేక బృందం ఉంటుంది. ప్రధాని తనలాంటి VIPల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన శాటిలైట్ లేదా RAX (నియంత్రిత ప్రాంత మార్పిడి) ఫోన్‌లను ఉపయోగిస్తారు. అన్ని ఇతర కమ్యూనికేషన్ల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎన్‌క్రిప్టెడ్ మొబైల్ ఫోన్‌ ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా పంపబడుతుంది. ఈ ఫోన్‌లు గుర్తించబడవు మరియు అవి మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పని చేస్తున్నందున హ్యాక్ చేయబడవు. అధికారులు ఈ మొబైల్స్ ను NTRO మరియు DEITY వంటి ఏజెన్సీలచే క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.


End of Article

You may also like