Ads
మనం ఏదైనా ట్రిప్ లేదా వర్క్ విషయమై వేరే ఊరు వెళ్లాలంటే.. ముందుగా మనం చేసే పని హోటల్స్ లో బుకింగ్ చేసుకోవడం. ఎందుకంటే మనది కానీ ఊరుకు వెళ్ళినప్పుడు మనకి ఫ్రెష్ అవడానికి, తిరిగి మన పనులు చేసుకోవడానికి మనకి ఒక రూమ్ అవసరం కచ్చితంగా ఉంటుంది.
Video Advertisement
అయితే.. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. హోటల్స్ లో చెక్-ఇన్ టైం 11-12 గం.లకే ఉంటుంది. అయితే.. ఇలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా హోటల్స్ రూల్స్ ప్రకారం చెక్ ఇన్ టైం 11-12 గం.లకే ఉంటుంది. తెల్లవారు జామునే చెక్-ఇన్ టైం ఇవ్వాలంటే దాని వల్ల హోటల్ వారికి నష్టం ఎదురవుతుంది. వారికి ఎలా నష్టం వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఓ వ్యక్తి ఉదయం 3.30 కి చెక్-ఇన్ చేస్తే, లెక్క ప్రకారం 24 గంటల తరువాత అంటే మరుసటి రోజు ఉదయం 3.30 కి చెక్-అవుట్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు ఆ రూమ్ ఖాళీ అయిపోతుంది. మరుసటి రోజు అదే టైం కి మరో కస్టమర్ వస్తారు అన్న గ్యారంటీ హోటల్ వారికి ఉండదు. పోనీ, అంతకంటే ముందే అంటే తెల్లవారు జామున రెండున్నర గంటలకి ఎవరైనా వచ్చి రూమ్ అడిగినా.. గంట ముందు చెక్-అవుట్ చేయాలనీ ముందు ఉన్న కస్టమర్ కి చెప్పలేరు. ఫలితంగా హోటల్ మేనేజ్మెంట్ కె లాస్ వస్తుంది. ఇలా ఇష్టం వచ్చిన టైం లో చెక్-ఇన్ మరియు చెక్-అవుట్ లు చేయడం వలన హోటల్స్ వారికి కస్టమర్స్ కి రూమ్స్ సర్దడం, వారి టైమింగ్స్ ని ఫాలో అవ్వడమే సరిపోతుంది.
అందుకే.. ఈ విధానాన్ని తీసేసి.. చెక్-ఇన్ మరియు చెక్-అవుట్ టైం ను పెట్టారు. ఈ 11-12 గం.ల కాన్సెప్ట్ వలన హోటల్ వారి పని సులువు అయింది. చెక్ ఇన్ చేసేవారు పదకొండు గంటలకే చేస్తారు. తిరిగి మరుసటి రోజు ఆ టైం కి చెక్-అవుట్ చేస్తారు. ఒకవేళ అంతకంటే ముందే చెక్-అవుట్ చేసినా.. ఆ మొత్తాన్ని కస్టమర్ చెల్లించుకోవాల్సి ఉంటుంది తప్ప హోటల్స్ ఓనర్ కి నష్టం రాదు.
End of Article