హాస్పిటల్ స్టాఫ్ మొత్తం వైట్ డ్రెస్ కోడ్ పాటిస్తారు… కానీ ఆపరేషన్ సమయం లో మాత్రం బ్లూ / గ్రీన్ ఎందుకు ధరిస్తారు.?

హాస్పిటల్ స్టాఫ్ మొత్తం వైట్ డ్రెస్ కోడ్ పాటిస్తారు… కానీ ఆపరేషన్ సమయం లో మాత్రం బ్లూ / గ్రీన్ ఎందుకు ధరిస్తారు.?

by Anudeep

Ads

వైట్ కలర్ ప్రశాంతత కు చిహ్నం. మనం ఏ ఆసుపత్రికి వెళ్లినా అక్కడ వైద్యులు కానీ, నర్సులు కానీ, ఇతర హాస్పిటల్ స్టాఫ్ కానీ వైట్ కలర్ దుస్తులనే ధరించి కనిపిస్తారు. ఎంత సీనియర్ వైద్యులు అయినా వారు వైట్ కోట్ ను వేసుకుని ఉంటారు. కానీ ఆపరేషన్ జరుగుతున్న సమయం లో మాత్రం ఎవరు వైట్ ధరించారు. బ్లూ లేదా గ్రీన్ దుస్తులనే ధరిస్తారు.. ఇది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

operation 2

మీరెప్పుడైనా గమనించారా..? మనం వేరు వేరు రంగులను చూసి ఒక్కసారిగా వైట్ కలర్ ను చూస్తే ఏమి కనిపించదు. కొన్ని సెకండ్ల పాటు దృష్టి కి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది ఆపరేషన్ చేస్తున్న సమయం లో రాకుండా ఉండడం కోసమే ఆపరేషన్ థియేటర్ లో తెలుపు రంగు దుస్తులను ధరించరు. ఆపరేషన్ చేసే సమయం లో వైద్యుడు చాలా అప్రమత్తం గా ఉండాలి. రక్తాన్ని కళ్ళ చూస్తున్నపుడు బెదరకుండా నిశ్చలం గా పని చేయాలి.

operation 1

దృష్టి అంతరాయం లేకుండా ఉండడానికి తెలుపు రంగు దుస్తులు ధరించరు.. కానీ నీలం, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాం.. ఎందుకంటే.. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కు ఆపోజిట్ రంగులైన బ్లూ, గ్రీన్ రంగుల దుస్తులైతే కంటికి ఎలాంటి దృష్టి అంతరాయం ఏర్పడకుండా వైద్యులు మరింత ఎక్కువ గా ఫోకస్ చేయగలుగుతారు. అందుకే.. ఆపరేషన్ చేసే సమయం లో మాత్రం నీలం, ఆకుపచ్చ రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఉంటుంది.


End of Article

You may also like