ఇండియాలో ఫ్యాన్ కి 3 రెక్కలే ఎందుకు ఉంటాయో తెలుసా.? అమెరికాలో 4 రెక్కల ఫ్యాన్ లు ఎందుకు.?

ఇండియాలో ఫ్యాన్ కి 3 రెక్కలే ఎందుకు ఉంటాయో తెలుసా.? అమెరికాలో 4 రెక్కల ఫ్యాన్ లు ఎందుకు.?

by Anudeep

Ads

భారత్ లో ఫ్యాన్స్ కి మూడు రెక్కలు ఉంటాయి అని అందరికి తెల్సు.. కానీ, అమెరికా లో ఉండే ఫ్యాన్లకు నాలుగు రెక్కలు ఉంటాయి అనే విషయం చాలా మందికి తెలీదు. అసలు ఫ్యాన్లకు రెక్కలెందుకు ఉంటాయి.? గది లో ఉండే గాలిని మరింత ఎక్కువ గా ప్రసరింప చేయడం కోసం రెక్కలను పెడతారు. ఈ రెక్కలు పొడవుగా ఉండి.. మనం ఫ్యాన్ ని ఆన్ చేసినప్పుడు తిరగడం ద్వారా గాలిని గదంతా వ్యాప్తి చెందిస్తాయి. అందుకే మనం, ఫ్యాన్ ఆన్ చేయగానే హాయిగా గాలి మన శరీరాన్ని తాకుతుంది.

Video Advertisement

fans feature image

అయితే, భారత్ లో మాత్రం ఏ ఫ్యాన్ కి అయిన మూడు రెక్కలే ఉంటాయి. కానీ, అమెరికా , కెనడా వంటి దేశాలలోని ప్రజలు ఉపయోగించే ఫ్యాన్ లు ఇక్కడి ఫ్యాన్ లకు భిన్నం గా ఉంటాయి. ఈ ఫ్యాన్ లకు నాలుగు రెక్కలు ఉంటాయి. వీటి ద్వారా గది లోని గాలి మరింత ఎక్కువ గా ప్రసరించడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశాల్లోని ఫ్యాన్స్ కి నాలుగు రెక్కలు ఉండడానికి గల కారణాలను తెలుసుకోండి.

four blade fan

మొదటి కారణం ఏమిటంటే, అమెరికా, కెనడా వంటి దేశాలు చాలా చల్ల గా ఉంటాయి. ఈ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా. అక్కడ కేవలం ఎయిర్ కండిషనర్ ను ఎక్కువ గా వాడుతుంటారు. బయట ఉండే వాతావరణం కంటే.. లోపల ఉండే వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయం లో ఎయిర్ కండిషనర్లు సాయం చేస్తాయి. కాబట్టి ఫ్యాన్ ల అవసరం వారికి సెకండరీ ఛాయస్ గా ఉంటుంది. ఎయిర్ కండిషనర్ ద్వారా వచ్చే గాలిని గది లోని నాలుగు దిక్కులా విస్తరించేందుకు అక్కడి వారు నాలుగు రెక్కలున్న ఫ్యాన్ లను ఉపయోగిస్తారు. కానీ, భారత్ లో పరిస్థితి అది కాదు. ఇక్కడ చాలా మంది ఎయిర్ కండీషనర్ ను కొనలేరు. గాలి కోసం ఫ్యాన్లపైనే ఆధారపడతారు.

four blade fan1

మరో కారణం ఏమిటంటే, ఫ్యాన్లకు నాలుగు రెక్కలు ఉండడం వలన మోటార్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితం గా మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్లకంటే నాలుగు రెక్కలున్న ఫ్యాన్లు తక్కువ సామర్ధ్యం తో పని చేస్తాయి. అమెరికా కెనడా వంటి దేశాల్లో గదిని చల్లబరుచుకోవడానికి ఏసీలు ఉంటాయి కాబట్టి వారికి తక్కువ సామర్ధ్యం ఉన్నా సరిపోతుంది. కానీ, భారత్ వంటి ఉష్ణ దేశాల్లో ఎక్కువ గాలిని గదంతా విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చోట్ల మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్లు ఎక్కువ అవసరం అవుతాయి. మూడు రెక్కలు ఉండే ఫ్యాన్లలో మోటర్ పై తక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ వేగం గా, సమర్ధవంతం గా పని చేస్తాయి.

three blade fans

వేరు వేరు దేశాల్లో, వేరు గా ఫ్యాన్ల గురించిన సమాచారం మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయని మీకు అనిపిస్తే, కింద కామెంట్ చేయండి.


End of Article

You may also like