Ads
డబ్బు ని దాచుకోవడానికి బంగారం కొనడం కూడా ఓ మార్గమే. మహిళలు కొత్త ఆభరణాలు ధరించడం కోసం బంగారం కొనాలి అనుకుంటూ ఉంటారు. బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. బంగారం కొని పెట్టుకున్నాం అంటే.. డబ్బుని దాచుకున్నట్లే. అందుకే.. చాలా మంది పెట్టుబడుల్లో పెట్టడం కంటే.. బంగారం కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు..
Video Advertisement
అయితే.. మీరెప్పుడైనా గమనించారా..? బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకి ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు.
అయితే.. ఇలా పింక్ కలర్ పేపర్ లోనే ఎందుకు పెడతారు..? వేరే ఏదైనా కలర్ పేపర్లో కూడా పెట్టి ఇవ్వొచ్చు కదా..? మీకెప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే.. ఈ ఆర్టికల్ చదివి మీ డౌట్ ని క్లియర్ చేసుకోండి. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రోడక్ట్ ని హై లైట్ చేసే విధంగా ఉండాలని అనుకుంటారు. ఉదాహరణకి సర్జరీ చేసేటప్పుడు వైద్యులు ఆపరేషన్ గదిలో ఆకుపచ్చని బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు.
ఎందుకంటే.. సర్జరీ చేసే సమయంలో కంటికి ఎక్కువ రక్తమే కనబడుతూ ఉంటుంది. ఆ టైములో ఆకుపచ్చని రంగు కూడా కనిపిస్తూ ఉండడం వలన కళ్ళకి కొంత ఉపశమనం లభించడంతో పాటు వారు సర్జరీ చేయడంపై ఫోకస్ చేయగలుగుతారు. కృష్ణుడి పెయింట్లను కూడా గమనించినట్లయితే వెనుకాల ఆవులను పూర్తి తెలుపు రంగులోనే ఉండేలా వేస్తారు. లేదంటే ఏదైనా తేలికపాటి రంగు బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూస్తారు. ఎందుకంటే కృష్ణుడి మేని ఛాయ నలుపు రంగు. కృష్ణుడు అందంగా కనిపించాలంటే వెనుకాల ఉండే రంగు తేలికపాటి రంగు అయి ఉండాలి.
ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుంది. బంగారం మెరుస్తూ ఉంటుంది. అయితే.. ఆ మెరుపు సరైన విధంగా కనిపించాలంటే వెనుకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ మంచిగా ఉండాలి. అందుకోసమే వెండి లేదా బంగారం వస్తువులను అమ్మే వారు ఈ రంగు పేపర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. నలుపుని చాలా మంది అశుభ సూచకంగా ఉపయోగిస్తారు. ఇక ఆ రంగు కాకుండా పింక్ రంగు పేపర్ అయితే బంగారం మెరుపుని అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే పింక్ కలర్ పేపర్ ను ఉపయోగిస్తారు.
End of Article