చెట్లకి ఇలా కింద వైట్ కలర్ పెయింట్ ఎందుకు వేస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

చెట్లకి ఇలా కింద వైట్ కలర్ పెయింట్ ఎందుకు వేస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

రోడ్డు పక్కల, పార్కులలోను చెట్లకు ఇలా కింద భాగంలో వైట్ పెయింట్ ను వేసి ఉండడం ఎప్పుడైనా గమనించారా..? ఇలా ఎందుకు వేస్తారో తెలుసా..? మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అన్నది మనం వినే ఉంటాం. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రకృతిని కాపాడుకుంటూ ఉండాలి. చెట్లను కొట్టివేయకూడదు.

Video Advertisement

సరైన సంఖ్యలో చెట్లు ఉండకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని సరైన సమయానికి వర్షాలు పడవు. దీని వలన కరువు సంభవించి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అందుకే చెట్లను నాటడం, పెంచడం మాత్రమే కాకుండా.. ఉన్న చెట్లను కూడా సంరక్షించుకుంటూ ఉండాలి. చెట్లను సంరక్షించడంలో భాగంగానే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. వాటిల్లోనే ఒకటి చెట్ల అడుగు భాగంలో తెలుపు రంగు పెయింట్ వేయడం. చెట్లను కాపాడడం కోసమే చెట్ల అడుగు భాగంలో ఇలా తెలుపు రంగు పెయింట్ వేస్తారు.

నిజానికి చెట్ల ట్రంక్ వద్ద ఇలా పెయింట్ వేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే.. అలా పెయింట్ వేయబడిన చెట్లు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఈ చెట్లను ఎవ్వరూ కొట్టివేయకూడదు అని అర్ధం. కొన్ని చెట్లకు ఎరుపు, తెలుపు రంగుల మిశ్రమంలో పెయింట్ వేస్తారు. కాబట్టి వాటిని రాత్రి సమయాల్లో కూడా చూడగలుగుతాము.

అలాగే.. పురుగులు, చెదలు వంటి వాటినుంచి చెట్టు కాండాన్ని కాపాడడం కోసం కూడా ఈ పెయింట్ ను వేస్తారు. కొంత వయసు వచ్చాక చెట్ల కాండాలు విరిగి పోతూ ఉంటాయి. కానీ.. వాటికి పెయింట్ వేయడం వల్ల ఆ కాండాలు తిరిగి అతుక్కుని చెట్టు ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణాలతోనే చెట్ల అడుగు భాగంలో ఇలా తెల్లని రంగు పెయింట్ ను వేస్తారు.


End of Article

You may also like