Ads
మన హిందూ ధర్మాన్ని అనుసరించేవారు తులసి చెట్టును దేవతగా ఆరాధిస్తారు. మన భారతదేశంలో తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు కనిపిస్తూ ఉంటుంది.
Video Advertisement
ప్రతిరోజూ నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూనే ఉంటారు. తులసి చెట్టును సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం పూజలు చేస్తారు కాబట్టి సిరిసంపదలు కలుగజేస్తుందని భావిస్తారు.
అయితే తులసి చెట్టుకు నీరు పోసే విషయంలో కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి ఆ నియమాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది నిత్యం సాయంత్ర కాలంలో తులసి చెట్టుకు నీరు పోస్తూ ఉంటారు ఇది శాస్త్రానికి విరుద్ధం. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో తులసి చెట్టు కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేదతీరుతూ ఉంటారు కాబట్టి నీరు పోయడం విరుద్ధమని పండితులు చెబుతున్నారు.
పెరట్లో తులసి చెట్టుకు ఎక్కువ ఆకులు ఎండిపోయినట్లు ఉంటే, ఆ చెట్టును తీసివేసి దాని స్థానంలో కొత్త తులసి మొక్కను ప్రతిష్టించాలి. తీసివేసిన తులసి చెట్టు ని ఎవరు తిరగని చోట వదిలిపెట్టాలి. శారీరక శుభ్రం లేకుండా తులసి చెట్టును తాకకూడదు. ముఖ్యంగా ఆడవారు తులసి ఆకులను తుంపకూడదు.
సూర్య, చంద్ర గ్రహణా కాలంలోనూ, అమావాస్య పౌర్ణమి ఈ సమయంలోనూ తులసి చెట్టును అస్సలు తాకరాదు. ముఖ్యంగా “ఏకాదశి ఆదివారం కలిసి వచ్చినప్పుడు” తులసి చెట్టుకు నీరు పోయడం విరుద్ధమని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ నియమాలు పాటించని వారికి కుటుంబంలో లేని పోని చికాకులు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు.
Also Read : ఆడవాళ్లు పొరపాటున కూడా ఇంట్లో ఈ పనులు చేయవద్దు…
ఆడవాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసా…
End of Article