Ads
పెళ్లంటే మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నిండు నూరేళ్ల పాటు కలిపి ఉంచే బంధం. అయితే పలు కారణాల వల్ల ఈ మధ్య చాలా జంటలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే విడాకులు అనేది వివాహానికి చట్టబద్ధమైన ముగింపు. వివాహ వ్యవస్థ పట్ల ఆలోచనలు మరియు నమ్మకాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి.
Video Advertisement
అయితే ఇలా విడిపోవాలి అనుకున్న జంటలకు హిందూ విడాకుల చట్టం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. భారతదేశంలో ఇంతకు ముందు రోజుల్లో విడాకుల కేసులు చాలా తక్కువగా ఉండేవి. కానీ కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణి కూడా మారిందని గమనించారు. భాగస్వాములు వివాహాన్ని కొనసాగించలేమని భావిస్తే విడాకుల వైపు వెళ్లడానికి వెనుకాడరు.
అయితే భార్యాభర్తలు ఉమ్మడి అంగీకారం తెలిపి విడాకులు తీసుకుంటే భర్త నుంచి భృతిని పొందే అవకాశం ఉంటుంది. భార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య లేదా భాగస్వామి జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆదాయం లేని భార్యకు తిండి, దుస్తులు, వసతి, విద్య, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చులను భాగస్వామి ఇవ్వాలని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 3 (బి) చెబుతోంది. వివాహం కాని కూతురు ఉన్నప్పుడు ఆమె వివాహం అయ్యేవరకు అవసరమైన ఖర్చులను ఇవ్వాలి. భర్త మరణిస్తే ఆమె మామగారు (భర్త తండ్రి) మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇదే చట్టంలోని సెక్షన్-19 చెబుతోంది.
అలాగే పెళ్లి సమయం లో ఇచ్చిన కట్నాన్ని కూడా వెనక్కి తీసుకొనే అవకాశం ఉంది. దీనికోసం ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. దాన్ని బట్టి కేసు ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు విడాకులు మంజూరు చేస్తారు. ఇది పరస్పర అంగీకారం తో జరిగే విడాకులలో ఇలా జరుగుతుంది. ఒకవేళ కోర్ట్ బయట సెట్టిల్ చేసుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేస్తారు.
ఒకవేళ విడాకుల సమయం లో ఎటువంటి భరణం ఆశించకపోయినా భవిష్యత్తులో ఆమె తన మాజీ భర్త నుంచి భరణం అడిగే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో పిల్లలు కూడా ఆస్తులు లేదా భరణం కోసం కేసులు వేసుకొనే అవకాశం ఉంది.పూర్తి బాధ్యత కేవలం తల్లికి మాత్రమే అని అగ్రిమెంట్ లో రాసుకొని ఉంటే మాత్రం పిల్లలకి ఆస్తులు వచ్చే అవకాశం లేదు. ఇవి హిదువులకు అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం, ఇతరులకు అయితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉంటాయి.
Also read: భారతీయ “విడాకుల చట్టం” ప్రకారం 2023 లో మారిన 7 నియమాలు ఇవే..!
End of Article