2019 నుండి… 2023 వరకు..! జొమాటో CEO పోస్ట్..! ఏం అన్నారంటే..?

2019 నుండి… 2023 వరకు..! జొమాటో CEO పోస్ట్..! ఏం అన్నారంటే..?

by Anudeep

Ads

ఇప్పుడు ఎవరిని అయినా తమ లైఫ్ స్టైల్ ఏంటని అడిగితే చెప్పే మొదటి మాట ఫిట్నెస్ మెయింటెయిన్ చెయ్యడం. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాము, సరైన పోషకాహారాలు తీసుకుంటాము అని చెప్పేవారు చాలా మందే ఉన్నారు.

Video Advertisement

దానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి విజృభణ అనే చెప్పొచ్చు. అది వచ్చాకే చాలా మందిలో ఆరోగ్యంపై శ్రద్ధ, తీసుకునే ఆహారంపై అవగాన పెరిగింది. ఇప్పుడు ఆ జాబితాలో జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు.

zomato ceo

కాకపోతే ఆయన కరోనా వచ్చిందని కాకపోయినా అంతక ముందు నుండే ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీపిందర్ గోయల్ 2017 నుండే తన బిజినెస్ పనులు చూసుకుంటూనే ఆరోగ్యం కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అలా 2019 నుండి ఒక షీట్ రాసుకుని, అప్పుడు ఎంత బరువు ఉన్నారో, ఎన్ని క్యాలరీలు ఉన్నారు అన్న ప్రతీ విషయాని రాసి పెట్టుకున్నారు.

zomato ceo

తర్వాత 2023 లో ఎంత బరువు తగ్గారు, అనే తేడాను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆహారపు అలవాట్లను వివరించారు. మొదట ఫుడ్ హ్యాబిట్స్ వేరేలా ఉండేవి కానీ నిరంతరం వ్యాయామం మొదలు పెట్టి, వారానికి ఒకసారి గులాబ్ జామూన్, చికెన్ వంటివి తిన్నాను. అలా మెల్లగా ఆహార అలవాట్లను మార్చుకున్నాను. నేను ఏవీ పెద్ద పెద్దగా వ్యాయామాలు చెయ్యలేదు, చిన్నవే నిరంతరం చేశాను కానీ ఎక్కగా మధ్యలో ఆపలేదు. అదే నా బరువు తగ్గడానికి దోహద పడింది.

zomato ceo

అలా మొత్తంగా 87 కిలోల 72 కిలోలకి వచ్చాడట. అంటే మొత్తంగా 15 కిలోలు తగ్గాడు. మహమ్మారి వచ్చేకంటే ముందు నుండే నా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాను అలా 2019 2023 సంవత్సరాల మధ్యలో నేను ఎలా చేంజ్ అయ్యానో చూడొచ్చు. అంటూ పోస్ట్ లో వివరించారు దీపిందర్ గోయెల్. తన పోస్టుతో అందరూ అభినందిస్తూ, చాలా గ్రేట్ వర్క్ చేశారు… అలాగే మీరు ఎటువంటి డైట్ ఫాలో అయ్యారు మాకు కూడా చెప్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్లు చేశారు.

ALSO READ : హిందూ వివాహ చట్టం నియమాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి కారణాలకి విడాకులు మంజూరు చేస్తారు..?


End of Article

You may also like