పెట్రోల్ బంక్ లలో ఈ 6 సేవలను ఉచితంగా పొందవచ్చని తెలుసా..? అవేంటో మీరే చూడండి..!

పెట్రోల్ బంక్ లలో ఈ 6 సేవలను ఉచితంగా పొందవచ్చని తెలుసా..? అవేంటో మీరే చూడండి..!

by Anudeep

Ads

పెట్రోల్ బంక్స్ ఎందుకు ఉంటాయి..? అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి అని అంటారా..? అయితే పప్పులో కాలేసినట్లే. పెట్రోల్ కాకపోతే డీజిల్.. ఈ రెండు కాకుండా పెట్రోల్ బంక్ ఇంకేమి చేస్తుంది..? అని ఆలోచిస్తున్నారా. పెట్రోల్ బంక్స్ భారత పౌరులకు ఆరు సేవలను ఉచితంగా అందించాలట.

Video Advertisement

ఈ ఆరు సేవలను ఉచితంగా అందించేటట్లు అయితేనే.. వారికి పెట్రోల్ బంక్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇస్తారట. లేకుంటే.. బంక్ నిర్వహించడానికి కూడా అనుమతి ఉండదట.

petrol bunks 1

ఏ కారణంగా అయినా.. పెట్రోల్ బంక్స్ ఈ ఆరు సేవలను పౌరులకు అందించకపోతే.. తక్షణమే భారత పౌరులు సదరు పెట్రోల్ బంక్ పైన ఫిర్యాదు చేయవచ్చట. ఇంతకీ పెట్రోల్ బంక్ వారు భారత పౌరులకు అందించే ఆ ఆరు సేవలు ఏంటో తెలుసా..? అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

petrol bunks 2

#స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంక్స్ విధిగా మూత్ర శాలలను నిర్వహించాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే ఆర్డర్ జారీ చేసింది. మనం లీటర్ పెట్రోల్ కు చెల్లించే ఖరీదులో 4 నుంచి 8 పైస‌లు మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం కేటాయించబడుతోంది.

#అలాగే పెట్రోల్ బంక్ కు వచ్చేవారిలో అవసరం అయిన వారికి ఉచితంగా తాగు నీటిని అందించాలి. ఇందుకోసమే బంక్ డీలర్ ఆర్వో యంత్రం, వాట‌ర్ కనెక్ష‌న్ లను కూడా తీసుకోవాలి.

petrol bunks 3

# అలాగే బంక్ కి వచ్చే వాహనాలలో ఉచితంగా గాలి నింపాలి. ఇందుకోసం ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయరాదు.

# పెట్రోల్ బంక్స్ సమీపంలో ఎవరికైనా గాయాలు ఐతే.. ప్రధమ చికిత్స చేయాలి. ఇందుకోసం అవసరమైన కిట్ ను కూడా పెట్రోల్ బంక్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.

petrol bunks 4

# పెట్రోల్, డీజీల్ నాణ్యతా ప్రమాణాలను ఏ వినియోగదారుడు అడిగినా చెప్పాలి. వారికి ఆ హక్కు కచ్చితంగా ఉంటుంది.

# అలాగే.. అత్యవసర పరిస్థితులలో ప్రజలకు పెట్రోల్ బంక్ నుంచి ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.


End of Article

You may also like