నా భర్త చేసిన తప్పుకి నాకు శిక్ష.. అతనికున్న ఆ అలవాటే ఈ వయసులో నాకీ అవస్థ తెచ్చింది.. తప్పకుండా చదవండి!

నా భర్త చేసిన తప్పుకి నాకు శిక్ష.. అతనికున్న ఆ అలవాటే ఈ వయసులో నాకీ అవస్థ తెచ్చింది.. తప్పకుండా చదవండి!

by Anudeep

Ads

ఒకరు చేసిన తప్పుకి మరొక జీవితం అన్యాయంగా బలైపోతున్నారు. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేసినా, అలవాటు మానుకోలేక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి  80 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు.

Video Advertisement

ఇప్పుడు అదే విధంగా భర్త చేసిన చిన్న తప్పుకు బలియ్యారు నళిని సత్యనారాయణ్. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. ఆమెకు సిగరెట్ తాగే అలవాటు లేదు. కానీ భర్త సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల ఆమె క్యాన్సర్ బారినపడింది. నళిని క్యాన్సర్ వంటి మహమ్మారికి గురి కావడానికి గల కారణాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.

Nalini satyanarayan

నా భర్త చైన్ స్మోకర్. ఆ ప్రభావం నాపైన పడింది. దీని కారణంగా నాకు క్యాన్సర్ వస్తుందని తెలియదు. ఆయన ఆరోగ్యం గురించి నాకు ఎప్పుడూ దిగులుగానే ఉండేది. ఆ సిగరెట్ తాగే అలవాటు మానుకోవాలని ఎప్పుడూ ఆయనను బతిమాలాడుతూ ఉండేదాన్ని. కానీ ఆయన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.

Also Read : ఆ డైరెక్టర్ తో కంపేర్ చేసినందుకు అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్న నెటిజన్లు…

ముప్పైమూడేళ్ళ వైవాహిక జీవితం ఆయనతో అలాగే సాగిపోయింది. ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత నాకు 2010లో ఈ క్యాన్సర్ వ్యాధి బయటపడింది. ఒకరోజు తన గొంతు బొంగురు పోయినట్లు కనిపెట్టాను. తన మాటల్లో స్వస్థతను కోల్పోయాను. మరి కొన్ని రోజుల తర్వాత పూర్తిగా తన గొంతును పోగొట్టుకున్నారు.

Nalini satyanarayan cancer serviorఆమెకు గల ఈ సమస్యలు థొరాసిక్ క్యాన్సర్ వైద్యులు గుర్తించారు. ఆమె ఓకల్ కార్డ్స్, థైరాయిడ్ గ్రంథిని తొలగించారు. ఇక నా పాత గొంతు నాకు తిరిగి రాదు అని డాక్టర్లు చెప్పారు. నేను మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోయానని తెలుసుకుని నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఒంటినిండా ఎక్కడపడితే అక్కడ ట్యూబులు అమర్చారు అని చెప్పారు.

ఇప్పుడు నళినికి మెరుగైన వైద్యం అందడంతో వైబ్రేషన్ వాయిస్ బాక్స్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. నా భర్త వలనే నాకు క్యాన్సర్ వచ్చింది. పొగాకు తాగేవారు విషపూరితమైన పదార్ధాలను గాలిలోకి వదులుతూ ఉంటారు. వారు వదిలే ఈ పొగ వల్ల అనేక మంది అనేక ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు.

World No tobacco day

ఇలాంటి ప్రమాదకరమైన అలవాట్లు మానుకొని, మనల్ని మన చుట్టుపక్కల వారిని కాపాడే బాధ్యత మనకు ఉంది. అంటూ మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నళిని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read :


End of Article

You may also like