అప్పుడు సచిన్… ఇప్పుడు జడేజా..! ఈ “కో-ఇన్సిడెన్స్” గమనించారా..?

అప్పుడు సచిన్… ఇప్పుడు జడేజా..! ఈ “కో-ఇన్సిడెన్స్” గమనించారా..?

by Mohana Priya

Ads

శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ని 574/8 దగ్గర డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్ కొనసాగించిన రవీంద్ర జడేజా (175 నాటౌట్: 228 బంతుల్లో 17×4, 3×6) భారీ సెంచరీ నమోదు చేశారు. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

Video Advertisement

మొదటిరోజు హిట్టర్ రిషబ్ పంత్ (96: 97 బంతుల్లో 9×4, 4×6) చేయగా, ఇవాళ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ (61: 82 బంతుల్లో 8×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మహ్మద్ షమీ (20 నాటౌట్: 34 బంతుల్లో 3×4)తో కలిసి కేవలం 94 బంతుల్లోనే 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధిస్తారు అని అనుకున్నారు.కానీ జట్టు స్కోర్ 574 వద్ద 130 ఓవర్‌లో రెండు బంతులు ముగిసిన తర్వాత భారత ఇన్నింగ్స్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేసారు.

netizens recall dravid after rohit sharma declares innings with jadeja

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్ 574 వద్ద డిక్లేర్ చేసింది. ఆ టైమ్‌కి జడేజా 175 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. ఈ రోజు ఇంకా సెషన్ ఉంది. జడేజా ఇంకొద్దిసేపు ఆడి ఉంటే 200 చేసేవారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసారు. దీంతో ఫ్యాన్స్ “జడేజా 200 అయ్యే వరకు ఆగి ఉండొచ్చుగా” అని రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

netizens recall dravid after rohit sharma declares innings with jadeja

ఇది ఇలా ఉంటే, గతంలో ఒకసారి సచిన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. 2004లో ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నపుడు ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో 675/5 స్కోరు వద్ద ద్రవిడ్ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశారు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 300 కొట్టి రికార్డు సృష్టించారు. కానీ సచిన్ ది కూడా 200 అయ్యే వరకు ద్రవిడ్ ఆగి ఉంటే బాగుండేది అని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు జడేజా విషయంలో కూడా ఇలాగే అవ్వడంతో క్రికెట్ అభిమానులు మరోసారి సచిన్ ఇన్నింగ్స్ గుర్తు చేసుకున్నారు.

netizens recall dravid after rohit sharma declares innings with jadeja

అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, 2004లో సచిన్ ఆడుతున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కెప్టెన్ ద్రవిడ్. ఇప్పుడు ద్రవిడ్ కోచ్. “అప్పుడు కెప్టెన్‌గా సచిన్ విషయంలో అలా చేసారు, ఇప్పుడు కోచ్‌గా జడేజా విషయంలో కూడా అదే తప్పు చేసారు” అంటూ కొందరు క్రికెట్ అభిమానులు ద్రవిడ్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like