Home horoscope Horoscope Today in Telugu 07.01.2023: ఈ రోజు రాశి ఫలాలు 2023

Horoscope Today in Telugu 07.01.2023: ఈ రోజు రాశి ఫలాలు 2023

by Sunku Sravan

Horoscope today in Telugu 2023: ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!! జ్యోతిష్య నిపుణులు తెలిపిన దాని ప్రకారం జనవరి 7 పుష్య బహుళ పాడ్యమి శనివారం. ఈ రోజు ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకోండి.

Horoscope Today Telugu 2023

Horoscope Today Telugu 2023

మేష రాశి ఫలితాలు 2023:

ఈ రాశి వారికీ ఈ రోజు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. పేపర్ వర్క్ మెరుగుపడుతుంది. ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. కానీ నష్టపోరు. ఈరోజు ఆంజనేయుడికి, పూజ చేసి కొబ్బరికాయను సమర్పించండి.

Also Read: WEEKLY HOROSCOPE IN TELUGU 2023: ఈ వారం రాశి ఫలాలు ఈ రాశి వారు ఈ వారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి !

వృషభ రాశి ఫలితాలు 2023

ఏ పనిలో అయినా అనూహ్య పరిస్థితులు ఎదురవ్వొచ్చు. కానీ వ్యాపారాలు కొనసాగిస్తాయి. ఆర్థిక రంగం సౌకర్యంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉదయించే సూర్యునికి పూజ చేయండి.

మిథున రాశి:ఈ రాశి వారు వ్యాపారాలలో, వాణిజ్యపరమైన విషయాల్లో చాలా చురుగ్గ ఉంటారు. శక్తిని మించి ప్రయత్నం చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇతరుల నుండి సపోర్ట్‌ లభిస్తుంది. వినాయకుడికి పూజ చేయడం మంచిది.

కర్కాటక రాశి ఫలితాలు 2023

ఆర్థిక లావాదేవీలలో తొందర పడొద్దు. ఆఫీసులో ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఖర్చులను తగ్గించుకోండి. క్రమశిక్షణగా ఉండండి. ఆయిల్‌ రాసిన రోటీని కుక్కకు పెడితే మంచిది.

సింహ రాశి ఫలితాలు 2023

ఈ రాశి వారికీ ఆఫీసులో సహోద్యోగులపై నమ్మకం ఉంటుంది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. సహనంతో ముందుకు సాగాలి. సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. శివ చాలీసా పఠించడం మంచిది.

కన్య రాశి ఫలితాలు 2023

వీరికి ఆర్థిక విషయాలు సాధారణం కన్న మెరుగ్గా ఉంటాయి. సెంటిమెంట్‌తో ప్రణాళికలను పంచుకోవడం మానేయండి.
సరస్వతీ దేవిని పూజించండి.

 

తుల రాశి ఫలితాలు 2023

విరి ఆఫీస్‌లో సానుకూలంగా ముందుకు సాగుతారు. వర్క్‌ లేదా బిజినెస్‌ మెరుగవుతుంది. వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణ అవకాశం బలపడుతుంది. శుభవార్తలు అందుతాయి. తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి ఫలితాలు 2023

ఈ రాశి వారు వ్యాపారంలో ముందుంటారు. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. పోటీ పడే తత్వం ఉంటుంది. వృత్తి నిపుణులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఆదా అవుతుంది.ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం మంచిది.

ధనస్సు రాశి ఫలితాలు 2023

ఈ రాశి వారు వ్యాపారంలో ముందుంటారు. ఆధునిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి. లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. జీవితం మెరుగ్గా ఉంటుంది. పేదవారికి అన్నదానం చేయండి.

మకర రాశి ఫలితాలు 2023

చేసే పనుల విధి, విధానాలపై అవగాహన కలిగి ఉంటారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. కెరీర్‌ బిజినెస్‌లో నమ్మకం వస్తుంది. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. రుణాలు తీసుకోవడం మానుకోండి. రాయడంలో తప్పులు చేయోద్దు. శివుడికి నీటిని సమర్పించండి.

కుంభ రాశి ఫలితాలు 2023

వ్యాపారంలో కెరీర్‌ బాగుంటుంది. పెండింగ్ కేసులు పురోగతి సాధిస్తాయి . వ్యాపారాలు మెరుగవుతాయి. ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిస్తారు. శ్రీరాముడికి హారతి ఇవ్వాలి.

మీన రాశి  ఫలితాలు 2023

మీరు ఆఫీస్‌లో స్పీడ్ గా ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు.మీ సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అన్ని పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. అనుభవజ్ఞుల సలహాలు పొందుతారు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Also Read: ఈ 5 రాశుల వాళ్లకి భద్ర రాజయోగం.. మరి మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..!

You may also like