బాలయ్యతో సినిమా అనగానే ఎగిరి గంతేసింది.. కానీ అంతలోనే ఆ విషయం తెలిసేసరికి..?

బాలయ్యతో సినిమా అనగానే ఎగిరి గంతేసింది.. కానీ అంతలోనే ఆ విషయం తెలిసేసరికి..?

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోలలో నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆరు పదుల వయసొచ్చినా రీసెంట్ గా అఖండ సినిమాతో బాలయ్య మరోసారి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపారు. అయితే.. బాలయ్య వయసులో ఉన్న టైం లో కూడా ఆయన సినిమాలు ఓ రేంజ్ లు హిట్ లు అయ్యేవి.

Video Advertisement

ముఖ్యంగా గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్ కు చాలా మంచి పేరు ఉండేది. వీరి కలయికలో వచ్చిన ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి.

seetha 3

కాగా.. 1988 వ సంవత్సరంలో బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ కాంబో లోనే ఓ సినిమాను ప్లాన్ చేసారు. ఈ సినిమాకు “ముద్దుల దొంగ” అనే టైటిల్ ను అనుకున్నారు. ఈ సినిమాపై గోపాల్ రెడ్డికి అంత ఆసక్తి లేకపోయినా బాలయ్య డేట్స్ ఇచ్చేసారు అన్న కారణంతో షూటింగ్ ని మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ కోసం చెన్నై వెళ్లిన గోపాల్ రెడ్డి “ఎంతంగచి పడిచావకి” అనే తమిళ్ సినిమాను చూసారు.

seetha 2

ఈ సినిమా ఆయనకు బాగా నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సినిమా తెలుగులో కూడా హిట్ అవుతుందని అనుకున్నారు. హీరోయిన్ గా విజయశాంతిని ముందే ఎంచుకున్నారు. ఇక సిస్టర్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అవడంతో ఆ పాత్ర కోసం పూర్ణిమ, శోభన వంటి హీరోయిన్స్ ని కూడా సంప్రదించారు. కానీ, వారు మరో సినిమా డేట్లతో బిజీ గా ఉండడంతో అప్పటికే బిజీగా ఉన్న హీరోయిన్ సీతని సంప్రదించారు.

seetha 1

బాలయ్యతో సినిమా అనగానే సీత నిజంగా సంతోషపడింది. ఆనందంతో ఎగిరి గంతేసిందట. కానీ, ఆ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించాం అని చెప్పేసరికి సీత ఒక్కసారిగా నిరాశ చెందారట. బిజీగా ఉన్న టైంలో చెల్లెలి పాత్రని ఎలా ఒప్పుకోవాలి అని ఆలోచించారట. కానీ, ఆ సమయంలో బాలకృష్ణ పాత్రకి ఉన్న ప్రాధాన్యతే, చెల్లెలి పాత్రకి కూడా ఉంటుందని, చెల్లెలి సెంటిమెంట్ పైనే ఈ సినిమా రూపొందుతుందని చెప్పేసరికి సీత ఒప్పుకున్నారట. మొత్తానికి సెట్స్ పైకి వెళ్లిన ఈ “ముద్దుల మామయ్య” సినిమా 1989 లో విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


End of Article

You may also like