యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో ప్రేక్షకులను నిరంతరం అలరించే పనిలో ఉంటాడు హీరో అక్షయ్ కుమార్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకు పోతున్నాడు. ఓ మై గాడ్ తో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓ మై గాడ్ 2 నిర్మించారు. ఎందుకో అక్షయ్ కుమార్ శివుని వేశంలో కనిపించనున్నారు. కానీ ఈ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు ఓ ఆదేశాన్ని జారీ చేసి, చిత్ర బృందానికి ఝలక్ ఇచ్చారు.
అయితే ఓ మై గాడ్ చిత్రాన్ని అమిత్ రాయ్ దర్శకత్వంలో… వియాకాం 18 స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమాకి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా… విడుదల చేసే సమయంలో సెన్సార్ బోర్డ్ కొన్ని ఆక్షలు విధించింది. దీంతో సినిమా విడుదల చెయ్యాలా వొద్దా అనే అయోమయంలో చిత్రం బృందం పడిపోయింది.
సుమారు 20 కట్స్ కి అంటే 20 సీన్లలో మార్పులు చెయ్యాలని, ఈ 20 సీన్లలో ఆడియో, వీడియో సీన్లు కూడా ఉన్నాయని, అంతే కాకుండా అక్షయ్ కుమార్ శివుని పాత్రలో వేసిన ప్రధాన పాత్రలో కూడా మార్పులు చెయ్యాలని చెప్పింది. నిజానికి ఈ సినిమాలో శివుని రూపం చూస్తుంటే వేరేగా ఉండటంతో… శివుణ్ణి దూతగా చూపించాలంటే నిబంధనలు పెట్టింది. దీంతో ఈ సినిమా విడుదల ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది.
ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు, పంకజ్ త్రిపాఠీ, యామి గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మరి చివరికి ఓ మై గాడ్ 2 లో సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులు చేసి సినిమా విడుదల చేస్తారా?? లేక ఉన్నది ఉన్నట్టుగానే ఉంచి సెన్సార్ బోర్డు నుండి అనుమతి వచ్చే దాకా వేచి ఉంటారు అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా విడుదల వాయిదా అయ్యిందని తెలుస్తోంది.