సినిమా ప్రపంచంలో జరిగే ప్రతీ విషయం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తమ అభిమాన స్టార్స్ సినిమా విడుదలైందంటే అభిమానులకు ఒక పెద్ద పండగ. తమ అభిమాన స్టార్స్ సెలబ్రేట్ చేసుకునే ప్రతి విషయం అభిమానులకు సంతోషంగా ఉంది.
మరి అలాంటి స్టార్స్ నే వివాహం చేసుకుంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అభిమానులను వివాహం చేసుకున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం…
#1 రజనీకాంత్
రజనీకాంత్ మరియు లతా జంట. తన కాలేజీ మ్యాగజైన్ స్టొరీ కోసం రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు లతా. ఆ సమయంలో రజినీకాంత్ పై తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
#2 విజయ్
లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబం సంగీతాది. ఈవిడ విజయ్ కి వీరాభిమాని. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. తన అభిమానినే పెళ్లి చేసుకున్న విజయ్ వివాహం అప్పట్లో ఒక సంచలనం వార్త.
#3 అమీర్ ఖాన్
లగాన్ సినిమా టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కిరణ్ రావుతో ప్రేమలోపడ్డారు అమీర్ ఖాన్. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటన అంటే కిరణ్ రావు ఎంతో అభిమానించేవారు.
#4 మాధవన్
సరిత, మాధవన్ కండక్ట్ చేసే పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్ క్లాసులకు హాజరు అయ్యారు. మొదటి చూపులోనే మాధవన్ సరిత ప్రేమలో పడిపోయాడు. 1999లో వీళ్ల వివాహం జరిగింది.
#5 జితేంద్ర
శోభా కపూర్ జితేంద్ర కు పెద్ద అభిమాని. శోభా కపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసేవారు. 1974లో శోభా కపూర్ మరియు జితేంద్రల వివాహం జరిగింది.
#6 దిలీప్ కుమార్
సైరాబానుకి చిన్నతనం నుంచి దిలీప్ కుమార్ అంటే ఇష్టం. ఆయన పైన ఇష్టం వ్యక్తంచేయడంతో 1966లో వీరి వివాహం జరిగింది.
#7 రాజేష్ ఖన్నా
డింపుల్ కపాడియా సినిమాలకు రాకముందు నుంచే రాజేష్ కన్నాకు వీరాభిమాని. ఈ విషయం తన సన్నిహితులతో తెలియజేయగా, వీరి అభిమానం కాస్త వివాహంగా మారింది.
#8 శిల్పా శెట్టి
వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాకు శిల్పా శెట్టి అంటే ఎంతో అభిమానం. 2009లో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాల వివాహం జరిగింది.