ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని ఇప్పటికే చాలా సంఘటనలు రుజువు చేసాయి. ఇద్దరి మనసుల కలయికకు వివాహ బంధం శాశ్వత గుర్తును ఇస్తుంది. ప్రేమకు మారు పేరు అయిన ఎందరినో చరిత్ర మనకు చూపిస్తోంది. అలాగే తమ నిజమైన ప్రేమ దొరికిన నాడే కొందరు సెలెబ్రెటీలు పెళ్లిపీటలెక్కారు.
పెళ్లి అంటే ఇప్పుడే చేసుకోవాలి.. ఈ వయసుకే చేసుకోవాలి.. అన్న మాటలను పక్కన పెట్టి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకున్న ప్రముఖులెవరో ఇప్పుడు చూద్దాం..
#1 సంజయ్ దత్
బాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ తన కంటే 19 సంవత్సరాలు చిన్నదైన మన్యతను 2008లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంజయ్ దత్ వివాహం చేసుకునే సమయానికి అతని వయసు 49 సంవత్సరాలు.
#2 అమీర్ ఖాన్
విభిన్న సినిమాలను తీసే హీరోల్లో అమీర్ ఖాన్ పేరు ముందుంటుంది. ఈ హీరో కూడా తన వ్యక్తిగత జీవితంలో 45 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావు అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసారు.
#3 ప్రభుదేవా
ప్రముఖ డాన్సర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా 2020 లో డాక్టర్ హిమనీ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 47 సంవత్సరాలు.
#4 జేడీ చక్రవర్తి
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేడీ చక్రవర్తి 2016 లో నటి అనుకృతి శర్మను వివాహం చేసుకున్నారు. వివాహం నాటికీ ఆయన వయసు 46 ఏళ్ళు.
#5 ఊర్మిళ
రంగీలా, క్రిమినల్, ఒకే ఒక్కడు సినిమాల్లో నటించి కుర్రకారుల మతి పోగొట్టిన బాలీవుడ్ భామ ఊర్మిళ కూడా 42 సంవత్సరాల వయసులో కాశ్మీర్ యువకుడు మీర్ మొహ్సిన్ అక్తర్ ను వివాహం చేసుకుంది.
#6 సైఫ్ అలీ ఖాన్
రేస్ హీరో సైఫ్ అలీ ఖాన్ 41 సంవత్సరాల వయసులో కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.
#7 ప్రీతి జింటా
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా 41 ఏళ్ల వయసులో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ 2016లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు.
#8 జాన్ అబ్రహం
బాలీవుడ్ సిక్స్ ప్యాక్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న జాన్ అబ్రహం 2014లో లాస్ ఏంజెల్స్ లో ప్రియా రుచల్ ను వివాహం చేసుకున్నారు. అప్పటికి జాన్ వయసు 42 సంవత్సరాలు.
#9 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 41 సంవత్సరాల వయసులో అన్నా లేజ్నేవా ని మూడో పెళ్లి చేసుకున్నారు.
#10 ఆశిష్ విద్యార్థి
పోకిరి సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు పొందిన నటుడు ఆశిష్ విద్యార్థి. ఈయన తన 60 వ ఏట రెండో పెళ్లి చేసుకున్నారు.
#11 దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు 49 ఏళ్ల వయసులో వైఘా రెడ్డి(తేజస్విని)ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
#12 నీనా గుప్తా
సీనియర్ నటి నీనా గుప్తా 2008లో.. తన 50వ ఏట చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది.
#13 వీకే నరేష్
సీనియర్ హీరో వీకే నరేష్ తన 50 వ ఏట రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు.
Also read: “జూనియర్ ఎన్టీఆర్” తో పాటు… ఈ 9 నటులు వదులుకున్న “ఫ్లాప్” సినిమాలు ఏవో తెలుసా..?