తెలుగు ప్రేక్షకులకు నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90ల్లో దాదాపు ప్రతి సినిమాలో సుధాకర్ ఉన్నాడు. అయితే అంతకంటే ముందే తమిళంలో చరిత్ర సృష్టించాడు సుధాకర్. సుధాకర్ సినిమాలపై ఇష్టంతో మద్రాస్ వెళ్లారు. అక్కడ చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలిసి ఒకే గదిలో ఉండేవారు.
అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా ఆయనకు పరిచయమయ్యారు. ఆయన అవకాశం ఇవ్వడంతో ‘కిళుక్కెమ్ పొంగెమ్ రెయిల్’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సుధాకర్‌కు అవకాశాలు పెరిగాయి. అలా తమిళంలో మూడేళ్ళలో సుమారు 45 సినిమాల్లో నటించారు. హీరోయిన్‌తో రాధికతోనే ఆయన ఏకంగా 18 సినిమాల్లో నటించడం విశేషం.
ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల కారణంగా కోలీవుడ్‌ను వీడిన ఆయన తెలుగులో విలన్‌గా, కమెడియన్‌గా స్థిరపడిపోయారు. హాస్యనటుడిగా ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా అందుకున్నారు. సినిమాల ద్వారా భారీగా సంపాదించిన సుధాకర్, తన మిత్రుడు హరిప్రసాద్‌తో కలిసి చిరంజీవి హీరోగా ‘యముడికి మొగుడు’ సినిమా నిర్మించారు. దీంతో మరికొన్ని సినిమాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అయితే అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యారు సుధాకర్.
సుధాకర్ 2010, జూన్ 29న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. 2015లో కోలుకున్న ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొన్ని సినిమాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ఆయన మరణించారంటూ కొన్ని వదంతులు రావడం మొదలైంది. పలు మీడియా సంస్థలు కూడా నటుడు కన్నుమూశారంటూ అదే వార్తను క్యారీ చేశాయి.
ఈ నేపథ్యంలో వాటిని ఖండిస్తూ సుధాకర్ ఓ వీడియోలో మాట్లాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు.
అయితే ఈ వీడియో లో సుధాకర్ ని చూసిన ఆయన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఎంతో అందంగా.. ఆరోగ్యం గా ఉండే సుధాకర్ ఇలా అయిపోయారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సుధాకర్ ఆరోగ్యం పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేయడంపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం సరికాదని ఫైర్ అవుతున్నారు.
Watch video:
https://www.instagram.com/p/Csn6GuYJ2jE/