ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి, ప్రజలకి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. కుటుంబ జీవితం కంటే ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండడానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. తాజాగా మెగా ఫామిలీ సంక్రాంతి పండుగ వేడుక ఫొటోలో ఆయన లేకపోవడమే దీనికి సాక్ష్యం.

మెగా ఫామిలీ సంక్రాంతి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా హాజరయ్యారు. అంతా ఒక్కచోట చేరి సంక్రాంతి సంబరాలలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు ఆ అకిరా, ఆధ్య కూడా హాజరయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మిస్ అవ్వడంతో ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఈ పండగను అమరావతిలో రాజధాని రైతులతో కలిసి జరుపుకున్నారు. నుమ రోజు తన ఫామ్ హౌస్ లో గోవుల మధ్య కనుమ వేడుకలు జరుపుకున్నారు. పశువులకు పండ్లు తినిపిస్తూ వాటి మధ్య కాసేపు గడిపారు.రైతులకు తోడుగా ఉండే పశువులు కూడా కుటుంబంలో భాగమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.కుటుంబమంతా ఒక చోట చేరి ఆనందంగా గడుపుతుంది పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో కలిసి పండగ చేసుకున్నారు. ఇది చూసి పవన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్‌కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.


ఇన్ అర్బీటాల్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లో పదకొండు అయ్యిందంటే చాలు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది వస్తారు. సాయి కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఆహారం టేస్టీగా ఉండడం, తక్కువ ధరలకు ఎక్కువ ఆహారం ఇస్తుండడంతో వారి ఫుడ్ బిజినెస్ బాగా సాగుతోంది. వంట అంతా ఆమె చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు వంటలు చేసుకుని, 11 గంటలకు షాప్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు అని చెప్పారు.
2011 నవంబర్ 29 కి స్టార్ట్ చేసారట. ఆమె గుడివాడకు చెందినవారు. ఈ బిజినెస్ ప్రారంభించక ముందు ఆమె మెషీన్ కుట్టేవారట. ఆమె భర్తకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి ఉండడంతో, ఆయన సపోర్ట్ చేయడంతో ఆమె కూడా బిజినెస్ లో కి వచ్చారు. లాక్ డౌన్ సమయంలో అనాథలకు ఆహార సరఫరా చేసే వాళ్ళు సాయికుమారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆహారం వండించేవారట.
ఆమె సింగర్ హేమచంద్ర అమ్మగారింట్లో వంట చేసేవారు. బిజినెస్ విషయంలో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు. రోజుకు 300 వందల మంది వరకు వస్తారని వెల్లడించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ, మొదటి నుండి ఆటంకాలు, ఆ తరువాత హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం, పలు రకాల ప్రచారాలు వచ్చాయి. ఓ దశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
ఆ సినిమా కాపీ అంటూ కొందరు, ఆ నవల కాపీ అంటూ మరికొందరు నెట్టింట్లో ఈ మూవీ పై విమర్శలు చేశారు. థియేటర్ల విషయంలోనూ వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి విమర్శల మధ్యనే మూవీ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో నెగెటివిటీ మొదలైంది. బుక్ మై షో యాప్ లో మూవీ రిలీజ్ కాకముందే 70 వేల మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే మహేష్ బాబు వల్లే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.
తాజాగా రవితేజ నటించిన దరువు మూవీలోని సీన్ ను త్రివిక్రమ్ కాపీ చేశారని, అదే సీన్ ను గుంటూరుకారంలో మహేష్ బాబుతో చేశారంటూ దరువు సీన్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నిజమే అంటుండగా, కొందరు అదేం కాదని అంటున్నారు.