తెలుగులో రియాల్టీ షో బిగ్ బాస్ కి మంచి ఆదరణ ఉంది. ఇప్పటివరకు ఏడు సీజన్లు ప్రసారమైన ఈ షో కి మంచి టిఆర్పి తో ఆదరణ లభిస్తూ వస్తుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని వ్యవహరించారు. అక్కడినుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోటీతో ఈ షో రోజు రోజుకి ఇంట్రెస్టింగా ఉంటుంది. ప్రతివారం ఎలిమినేషన్ తో ,డిఫరెంట్ టాస్కులతో రసవత్తంగా సాగుతుంది. చాలామంది బిగ్ బాస్ లో జరిగే రచ్చకి విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఈ షో అదేమీ లెక్క లేకుండా విజయవంతంగా సాగుతుంది.

అయితే ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కాంట్రవర్సీకి గురైంది. బిగ్ బాస్ సెవెన్ లో విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అయితే ఆయన విజేతగా నిలిచిన అనంతరం జరిగిన ర్యాలీలో పరిణామాలు పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. ఆయన అభిమానులు ఆర్టీసీ బస్సు అద్దాలు బద్దలు కొట్టడం, మిగతా కంటిస్టెంట్ల కారులను ధ్వంసం చేయడం వంటివి చేశారు.దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేసి చంచల్ గూడా జైలుకి తరలించారు. అనంతరం పలవి ప్రశాంత్ బైల్ పై బయటకు విడుదలయ్యాడు.
అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలు బట్టి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇకపై జరిగే సీజన్లలో విజేత అయిన ఎవరైనా సరే షో అనంతరం ర్యాలీ చేయకుండా ముందుగానే అగ్రిమెంట్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది




ఈ సినిమాలో దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, గణేష్ (దినేష్ తేజ్) విశాఖపట్నం దగ్గరలో ఉన్న పల్లెటూరికి చెందిన మిడిల్ క్లాస్ యువకుడు. అతనికి సినిమాలంటే పిచ్చి. ఎప్పటి కైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. గణేష్ జీవితంలోకి ఆ ఊరి అమ్మాయి దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు.
కానీ వారి లవ్ కు దివ్య అమ్మ కనకమ్మ (ఝాన్సీ) అడ్డుగా నిలుస్తుంది. ఆమె అప్పటికే దివ్యకు కాళీ (శత్రు) తో పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. విషయం తెలిసిన దివ్య, గణేష్ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా ఆపమని కోరుతుంది. కానీ దర్శకుడు కావాలనుకున్న గణేష్ కు ఏం చేయాలో అర్ధం కాదు. పెళ్లి కన్నా కెరీర్ ముఖ్యమని సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ వెళతాడు.
సలార్ మూవీ హిట్ తో పాపులర్ అయిన నటినటులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రియా రెడ్డి. ఆమె సలార్ లో రాజమన్నార్ కుమార్తె, రాధా రామ మన్నార్ క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ముందు కోలీవుడ్ లో మాత్రమే పాపులర్ అయిన శ్రియా రెడ్డి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా స్టేటస్ పొందారు.
తన నటనతో అందర్నీ ఆమె వైపుకు తిప్పుకున్నారు. దాంతో ఆమె గురించి తెలుసుకోవ డానికి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నటించిన తిమిరి తెలుగులో పొగరు సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ చిత్రం 2006 లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మూవీలో హీరోగా నటించారు. రీమాసేన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ చిత్రలో ఈశ్వరిగా శ్రియా రెడ్డి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశ్వరి పాత్రలో ఒదిగిపోయి, హీరోతో పోటీ పడి నటించారు. ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడానికి మరో కారణం జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్. పొగరు సినిమాలో వినాయకన్ నటించాడు. ఈశ్వరి పాత్రకు సహకరించే పాత్రలో మాయిగా వినాయకన్ నటించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వీరిద్దరు సలార్, జైలర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు.
ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా, ప్రమోద్ పంజు ఇతర కిలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ చిత్రమలో నటించిన నటీనటులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో ప్రమోద్ పంజు ఒకరు.
సలార్ లో వరద రాజమన్నార్ తమ్ముడు బాచి మన్నార్ పాత్రలో నటించి, మెప్పించాడు. ప్రమోద్ పంజు కన్నడంలో పాపులర్ యాక్టర్. 1990లో జనవరి 10న జన్మించాడు. మాండ్య జిల్లాకు చెందినవాడు. ప్రమోద్ పంజు మద్దూరులోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేశాడు. సురానా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2015 లో శాండల్ వుడ్ లో అడుగుపెట్టాడు.
ప్రమోద్ నటించిన మొదటి సినిమా గీతా బ్యాంగిల్ స్టోర్‌లో 11 సెప్టెంబర్ 2015న విడుదలైంది. ఆ తర్వాత 2019లో కన్నడ చిత్రం ప్రీమియర్ పద్మినిలో నటించాడు. మట్టే ఉద్భవ, అతను బుల్లితెర పై చుక్కి, పునర్వివాహ వంటి సీరియల్స్ లో నటించి, పాపులర్ అయ్యాడు. ప్రమోద్ మహాదేవి సీరియల్లో శివుడిగా నటించాడు. ఈ ఏడాది సలార్ పార్ట్ 1 లో నటించి, మరింత పాపులర్ అయ్యారు.
విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్‌కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.