సందీప్ రెడ్డి వంగా ఈ పేరు ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. ఒక తెలుగువాడు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెన్సేషన్ సృష్టించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక్కడ అర్జున్ రెడ్డి తీసి అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రూపొందించి హిట్ కొట్టాడు. వెంటనే రణబీర్ కపూర్ తో యానిమల్స్ సినిమా తీసి తాజాగా ఆ సినిమా తోటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
అయితే నెక్స్ట్ సందీప్ లైనర్ చూసుకుంటే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాకి సీక్వెల్, నెక్స్ట్ అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాని ప్రకటించారు. ఈ సినిమాల లైనర్ మొత్తాన్ని టి సిరీస్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలన్నింటినీ టి సిరీస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలియజేసింది.

అయితే అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా గురించి ఎటువంటి వివరాలు చెప్పలేదు.ఇది కూడా అనిమల్ తరహాలో సీక్వెల్స్ తో ఉండబోతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పుడప్పుడే స్పష్టంగా తెలియదు. దీనికోసం వేచి చూడాల్సిందే. అయితే అనిమల్ తినివాత సందీప్ తీసే ప్రతి సినిమా పైన అభిమానులకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఏ రేంజ్ సినిమా తీస్తాడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందీప్ కూడా దానికి తగ్గట్టే యానిమల్ సినిమాకి మించిన వైలెన్స్ నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు

ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ తో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు, ఫస్ట్ వీకెండ్ రికార్డులన్ని బ్రేక్ అవడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది.
సౌత్ ఇండియా మొత్తం సలార్ మేనియా ఉంది. బాహుబలి తరువాత సారీ అయిన విజయం లేని ప్రభాస్ కి ఈ మూవీ భారీ విజయన్ని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల నడుమ సలార్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్, ముఖ్యంగా హైదరాబాద్ లో థియేటర్లన్నింటి వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
అర్ధ రాత్రి నుండి థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. ఇక సలార్ మూవీ ఫస్ట్ షో చూసిన అభిమానులు, నెటిజెన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు, రివ్యూ ఇస్తుండడం, మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. మూవీ చూసిన సినీ సెలెబ్రెటీలు సైతం సినిమా పై అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో సలార్ మూవీ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
యానిమల్ మూవీ రిలీజ్ అయిన తరువాత ఎక్కువగా చర్చించబడిన అంశాలలో రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన రోజా, దిల్ హై చోటా సా మరియు భారత్ హమ్కో జాన్ సే ప్యారా హై లాంటి మాషప్ తో చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా ఈ సాంగ్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ కు నేపథ్య సంగీతాన్ని అందించింది హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ రాక్ ఫ్యూజన్ బ్యాండ్ త్రీయరీ. ఈ పాటలో వీరు కనిపించారు.
త్రీయరీ బ్యాండ్ 2017లో హైదరాబాద్‌లో జరిగిన అర్జున్ రెడ్డి ఆడియో లాంచ్ ఈవెంట్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ కు సందీప్ రెడ్డి వంగా ముగ్ధుడై, యూట్యూబ్‌లో వారి పని కోసం వెతికాడు. వారు రూపొందించిన ఒక వీడియోను చూశాడు. యనిమాల్ హీరో ఎంట్రీ సాంగ్ కోసం వారిని తీసుకున్నాడు. తొమ్మిది మంది సభ్యుల గల బ్యాండ్ ఈ స్కోర్‌ను రూపొందించింది.
ఈ బ్యాండ్ ముగ్గురు వ్యక్తులతో 2013లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు మరియు దక్షిణ భారత సంగీతంతో ప్రోగ్రెసివ్ రాక్ కలయికతో మ్యూజిక్ ను కంపోజ్ చేయడంలో వారికి మంచి నైపుణ్యం ఉంది. 2013 నుండి ఈ బ్యాండ్ తొమ్మిది మందికి పెరిగింది. ఈ గ్రూప్ లో కీస్పై మార్క్ టాలర్, వయోలిన్‌లో దత్త సాయి ప్రసా, డ్రమ్స్లో తరుణ్ విశాల్, డ్రమ్స్లో ఇంతియాకుమ్, గిటార్లో సెంటీలాంగ్ అవో, మహిళా గాయకుడిగా సింటీచే మోంగ్రో, పురుష గాయకుడు అఖిలేశ్వర్ చెన్ను, సితార్లో ఇర్ఫాన్ అహ్మద్, మరియు పవన్ కుమార్ ఎమ్.ఎస్. తబలా ఉన్నారు.

ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..
సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.




గత సీజన్ ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన మనీష్ పాండే ఐపీఎల్ 2024 వేలంలో కనీస ధర యాబై లక్షలకు కోల్‌కతా జట్టు కొనుగోలు చేసింది. మొదటి రౌండ్లో వేలంలో ఉన్న పాండేను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దాంతో అతను రెండోసారి వేలానికి వచ్చాడు. ఆ వేలంలో కేకేఆర్ పాండేని కనీస ధరకు కొనుగోలు చేసింది.
2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో మనీష్ పాండేను ముంబై ఇండియన్స్ కనీస ధర ఆరు లక్షలకు సొనటం చేసుకుంది. ఆ తర్వాత, 2009లో పందెను ఆర్సీబీ రూ. 12 లక్షలు కొనుగోలు చేసింది. ఆ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు సెంచరీ చేసి, ఐపీఎల్ లో సెంచరీ చేసిన మొదటి ఇండియన్ గా నిలిచాడు. ఆ తర్వాత పూణే వారియర్స్ రూ. 20 లక్షలు కొనుగోలు చేయగా, తరువాత, పాండే ఐపీఎల్ 2011, 2012, 2013 సీజన్లకు పూణే జట్టు తరపున ఆడాడు. 2014 లో కేకేఆర్ రూ. 1.70 కోట్లుకు సొంతం చేసుకుంది. ఆ ఏడాది విజేతగా కేకేఆర్ నిలవడంలో పాండే కీలకంగా మారాడు.
కేకేఆర్ పాండేని 2018 సీజన్‌కు ముందు రిలీజ్ చేసింది. దీంతో సన్ రైజర్స్ రూ.11 కోట్ల భారీ రేటుకు పాండేను కొనుగోలు చేసింది. మూడు సీజన్లలో సన్‌రైజర్స్ తరఫున ఆడినా పాండే అంతగా రాణించలేకపోయాడు. దాంతో అతను ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చాడు. అందులో లక్నో జట్టు రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ కూడా పెద్దగా రాణించకపోవడంతో, ఐపీఎల్-2023 వేలంలోకి వెళ్ళాడు. అందులో ఢిల్లీ జట్టు రూ.2.40 కోట్లకు సొంతం చేసుకోగా, పాండే ఆ ఛాన్స్ ని ఉపయోగించుకోలేదు. ఈసారి అతన్ని కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. చివరికి కేకేఆర్ కనీస ధరకు కొనుగోలు చేసింది.
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్దీప్ నిలిచారు. ఈ సందర్భంగా వారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరారు. మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని, గీతూ రాయల్ కారు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం, బెటాలియన్ బస్సు అద్దాన్ని సైతం పగలగొట్టారు. దీంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ దాడులకు కారణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. చెప్పిన పట్టించుకోకుండా ఫ్యాన్స్ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్లాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటుగా ఇంకో నలుగురిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రశాంత్, అతని సోదురుడిని అరెస్టు చేశారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏ3, ఏ4ల నిందితులను ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. కాగా, పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ దాడి విషయంలో తన ప్రమేయం ఏం లేదని అన్నారు. ఫ్యాన్స్ తాను రెచ్చగొట్టలేదని వెల్లడించారు.