ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ముంబై ఇండియన్స్ కి మారడం తీవ్ర చర్చ అయింది. క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. పూర్తిగా క్యాష్ డీల్ ప్రకారం ఈ ట్రేడింగ్ జరగడం అనేక అనుమానాలకి తావించింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ అందించడంతో హార్దిక్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత సీజన్ లో రన్నర్ అప్ గా నిలబెట్టాడు. ఇలాంటి కెప్టెన్ ను గుజరాత్ టైటాన్స్ మాత్రం ఎందుకు వదులుకుంటుంది అనే ప్రశ్న వచ్చింది.

ఈ డీల్ వెనుక ముంబై ఇండియన్స్ భారీ డబ్బుని ఏమైనా ఆఫర్ చేసిందా లేక లండన్ బేస్డ్ కంపెనీ అయిన గుజరాత్ టైటాన్స్ ఓనర్ సీవీసీ క్యాపిటల్స్ ను బెదిరించిందా? అనే ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చాయి.అయితే ఐపీఎల్ 2023 రూల్స్ ప్రకారమే హార్దిక్ పాండ్యా క్రాష్ ట్రేడింగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.ఐపీఎల్ ప్లేయర్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్ళ ను స్వాప్ చేసుకోవచ్చు. లేదంటే క్యాష్ డీల్ ద్వారా మార్చుకోవచ్చు. ఐపీఎల్ 2009 నుండి ఈ రూల్స్ ను ప్రవేశపెట్టారు. క్యాష్ డీల్ అంటే సదరు అటగాడికి పాత ఫ్రాంచైజీ ఇచ్చే డబ్బుతో ట్రాన్స్ఫర్ ఫీజును చెల్లించాలి.ట్రాన్స్ఫర్ ఫీజు ఎంత అమౌంట్ అనేది ఇరు ఫ్రాంచైజీల పరస్పర అంగీకారం పైన ఆధారపడి ఉంటుంది.

ఈ అమౌంట్ పైన ఎలాంటి పరిమితి లేదు. టీం పర్స్ వేల్యూపై కూడా దీని ప్రభావం ఉండదు. ఆ అమౌంట్ ఎంత అనేది ఐపీఎల్ నిర్వహకులతో ఇరు ఫ్రాంచైజీలకు మాత్రమే తెలుస్తుంది.ఈ ట్రాన్స్ఫర్ ఫీజులో 50% సదరు ఆటగాడికి చెల్లించాలి. కానీ ఇది కూడా ఇది ఫ్రాంచైజీల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఫీజులో 50% ప్లేయర్ కు చెల్లిస్తారా అనేది ఖచ్చితంగా చెప్పలేని విషయం.ట్రేడింగ్ విషయంలో ఆటగాడి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడింగ్ విషయంలో ప్లేయర్స్ ఇనిషియేషన్ తీసుకోవచ్చు.
క్యాష్ ట్రేడింగ్ విషయంలో పాత ఫ్రాంచైజీ తీసుకున్నదే తుది నిర్ణయం.తమ ఆటగాడిని వదులుకోవడం ఆ జట్టుకి ఇష్టం లేదంటే అతనికి ఇష్టం లేకపోయినా అదే జట్టులో కొనసాగాలి.ఈ రూల్ ప్రకారమే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి రావాలని ఉందని సమాచారం ఇచ్చాడు. వాళ్లు క్యాష్ ట్రేడింగ్, ప్లేయర్ స్వాపింగ్ ద్వారా హార్దిక్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ క్యాష్ డీల్ కు ఒప్పుకోవడంతో హార్దిక్ పాండ్యా ప్రైజ్ 15 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాన్స్ఫర్ ఫీజును కూడా చెల్లించారు.
Also Read:అంతమంచి ప్లేయర్ ని టీంలో నుండి తీసేసారు ఏంటి.? దీని వెనక ఆ ప్లాన్ ఉందా.?

న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 306 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ పెద్ద ఇన్నింగ్స్‌లు చేయలేదు.ఇక రెండవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. మూడో వన్డేలో సూర్యకుమార్ నెమ్మదిగా మొదలు పెట్టి, కొన్ని షాట్లు ఆడినా అంతగా ఆడలేకపోయాడు. దాంతో టీ20లో బాగా ఆడిన సూర్యకుమార్ వన్డే మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని మాజీ క్రికెటర్స్ పేర్కొంటున్నారు. ఈ కారణం వల్లనే సూర్యకుమార్ కి టెస్టు ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు.
ఇక వసీం జాఫర్ ఏమన్నారంటే, టీ20 క్రికెట్లో ఫీల్డర్‌ను ఎప్పుడూ స్లిప్‌లో ఉంచరని, అందువల్ల ఫీల్డర్ క్యాచ్ అవుట్ కాలేదని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. వన్డేలలో మరియు టెస్ట్ క్రికెట్లో కొన్నిసార్లు ఒకటి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఫీల్డర్లు స్లిప్‌లో ఉంచబడతారు. అప్పుడే చేసే చిన్న పొరపాటు కూడా ఔట్ అవ్వడానికి దారితీస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే మూడో వన్డేలో కూడా స్లిప్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాటల ప్రకారం సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే తన బ్యాటింగ్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి.







సాధారణంగా స్కూటర్, కారు, బస్సు, ట్రక్కువంటి వాహనాలకు మైలేజీ ఉండడం వల్ల 1 లీటర్ డీజిల్, పెట్రోల్ కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయో తెలిస్తుంది. మరి రైలు మైలేజీ గురించి ఎప్పుడైనా అని ఆలోచించారా? ఇతర వాహనాల లాగానే రైళ్ల మైలేజీ చాలా విషయాల పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా రైళ్లకి ప్రమాణాలు కూడా ఉన్నాయి. అయితే రైలు మైలేజీని ఇతర వాహనాల మైలేజీ వలె నేరుగా చెప్పడం కష్టమైన విషయం.ఎందువల్ల అంటే ట్రైన్ మైలేజ్ అనేది అది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైలు మరియు రైలు కోచ్‌ల నంబర్ పైన ఆధారపడి ఉంటుంది.
రైలు మైలేజీకి చెందిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రైన్ లోని కోచ్‌లు సంఖ్య. తక్కువ కంపార్ట్మెంట్ల ఉన్నట్లయితే రైలు ఇంజిన్‌పై ఎక్కువగా లోడ్ పడదు. ఇటువంటి సందర్భంలో రైలు ఇంజిన్ శక్తి పెరుగుతుంది. ఇక డీజిల్ రైలు ఇంజిన్ మైలేజీని గంటల ప్రాతిపదికన లెక్కిస్తారు. 24 నుండి 25 కోచ్‌లు ఉన్న ట్రైన్స్ లో ఒక కిలోమీటరుకు డీజిల్ సుమారు 6 లీటర్ల పడుతుందని కొన్ని నివేదికలలో తెలుపబడింది. అయితే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తో పోల్చినట్లయితే ప్యాసింజర్ రైళ్లకే డీజిల్ ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
ప్యాసింజర్ ట్రైన్ లో ఒక కిలోమీటరు దూరం వెళ్లేందుకు ఐదు నుండి ఆరు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఇలా అవడానికి కారణం ప్యాసింజర్ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగడమే. అయితే 12 కోచ్ లు కలిగిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజిన్‌కు 1 కిలోమీటరు ప్రయణించడానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఒక ట్రైన్ యొక్క మైలేజ్ దాని ఇంజిన్ శక్తి పై ఆధారపడి ఉంటుంది. దీనిలో తరచుగా ఎత్తు ఎక్కడం,బ్రేకింగ్, లోడ్ లాగడం వంటివి కూడా ఉంటాయని సమాచారం.
Also Read: 




