Ads
ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ముంబై ఇండియన్స్ కి మారడం తీవ్ర చర్చ అయింది. క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. పూర్తిగా క్యాష్ డీల్ ప్రకారం ఈ ట్రేడింగ్ జరగడం అనేక అనుమానాలకి తావించింది.
Video Advertisement
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ అందించడంతో హార్దిక్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత సీజన్ లో రన్నర్ అప్ గా నిలబెట్టాడు. ఇలాంటి కెప్టెన్ ను గుజరాత్ టైటాన్స్ మాత్రం ఎందుకు వదులుకుంటుంది అనే ప్రశ్న వచ్చింది.
ఈ డీల్ వెనుక ముంబై ఇండియన్స్ భారీ డబ్బుని ఏమైనా ఆఫర్ చేసిందా లేక లండన్ బేస్డ్ కంపెనీ అయిన గుజరాత్ టైటాన్స్ ఓనర్ సీవీసీ క్యాపిటల్స్ ను బెదిరించిందా? అనే ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చాయి.అయితే ఐపీఎల్ 2023 రూల్స్ ప్రకారమే హార్దిక్ పాండ్యా క్రాష్ ట్రేడింగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.ఐపీఎల్ ప్లేయర్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్ళ ను స్వాప్ చేసుకోవచ్చు. లేదంటే క్యాష్ డీల్ ద్వారా మార్చుకోవచ్చు. ఐపీఎల్ 2009 నుండి ఈ రూల్స్ ను ప్రవేశపెట్టారు. క్యాష్ డీల్ అంటే సదరు అటగాడికి పాత ఫ్రాంచైజీ ఇచ్చే డబ్బుతో ట్రాన్స్ఫర్ ఫీజును చెల్లించాలి.ట్రాన్స్ఫర్ ఫీజు ఎంత అమౌంట్ అనేది ఇరు ఫ్రాంచైజీల పరస్పర అంగీకారం పైన ఆధారపడి ఉంటుంది.
ఈ అమౌంట్ పైన ఎలాంటి పరిమితి లేదు. టీం పర్స్ వేల్యూపై కూడా దీని ప్రభావం ఉండదు. ఆ అమౌంట్ ఎంత అనేది ఐపీఎల్ నిర్వహకులతో ఇరు ఫ్రాంచైజీలకు మాత్రమే తెలుస్తుంది.ఈ ట్రాన్స్ఫర్ ఫీజులో 50% సదరు ఆటగాడికి చెల్లించాలి. కానీ ఇది కూడా ఇది ఫ్రాంచైజీల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఫీజులో 50% ప్లేయర్ కు చెల్లిస్తారా అనేది ఖచ్చితంగా చెప్పలేని విషయం.ట్రేడింగ్ విషయంలో ఆటగాడి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడింగ్ విషయంలో ప్లేయర్స్ ఇనిషియేషన్ తీసుకోవచ్చు.
క్యాష్ ట్రేడింగ్ విషయంలో పాత ఫ్రాంచైజీ తీసుకున్నదే తుది నిర్ణయం.తమ ఆటగాడిని వదులుకోవడం ఆ జట్టుకి ఇష్టం లేదంటే అతనికి ఇష్టం లేకపోయినా అదే జట్టులో కొనసాగాలి.ఈ రూల్ ప్రకారమే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి రావాలని ఉందని సమాచారం ఇచ్చాడు. వాళ్లు క్యాష్ ట్రేడింగ్, ప్లేయర్ స్వాపింగ్ ద్వారా హార్దిక్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ క్యాష్ డీల్ కు ఒప్పుకోవడంతో హార్దిక్ పాండ్యా ప్రైజ్ 15 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాన్స్ఫర్ ఫీజును కూడా చెల్లించారు.
Also Read:అంతమంచి ప్లేయర్ ని టీంలో నుండి తీసేసారు ఏంటి.? దీని వెనక ఆ ప్లాన్ ఉందా.?
End of Article