నటి సన గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర నుండి వెండితెర వరకు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సన. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 600 లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది.
నటి సన ప్రస్తుతం అటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే, ఇటు బుల్లితెర పై పలు సీరియల్స్ లో చేస్తూ బిజీగా బిజీగా ఉన్నారు. సన ముస్లిం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినా అమ్మవారి పాత్రలో నటించింది. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో అడుగగా సన ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాం..
సన అసలు పేరు షానూర్ సన బేగమ్. ఆమె తండ్రి క్రిష్టియన్, తల్లి ముస్లిం, తల్లిదండ్రుల మతాలు వేరైనప్పటికీ, తెలంగాణలో పుట్టిన సన, ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెరిగింది. ఆమెకు మొదటి నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి ఉన్నా, కుటుంబ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని, వాటి వైపు వెళ్ళలేదు. ఆమెకు టెన్త్ క్లాస్ లోనే పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత సన ఇష్టాలను గుర్తించిన అత్తమామలు ఆమెను చదవించడమే కాకుండా సనకు ఆసక్తి ఉన్న రంగంలోకి వెళ్ళేలా ప్రోత్సహించారని ఒక సందర్భంలో సన చెప్పుకొచ్చారు.
మొదట మోడలింగ్ ఫీల్డ్ లో రెంటరీ ఇచ్చిన సన, ఆ తరువాత యాంకరింగ్ చేశారు. ఆ తరువాత సినిమాలు, సీరియల్స్. ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అత్తమామలే అని సన చెప్పుకొచ్చారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో సన టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో మూవీలో సన నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముస్లిం అయ్యి ఉండి అమ్మవారి పాత్ర వేయడానికి కారణం ఏమిటి అడిగారు.
సన మాట్లాడుతూ ” నటిగా ఏ పాత్ర వచ్చినా చేశాను. అలా అమ్మవారిగా నటించాను. ఇప్పుడు హిందూ ముస్లిం అని అంటున్నారు. కానీ, ఆ రోజుల్లో ఇలా మాట్లాడుకునేవాళ్ళు కాదు. అప్పుడు అందరూ హిందువు అనుకున్నారు కానీ ముస్లిం అని అనుకోలేదని అన్నారు. అమ్మవారి పాత్ర ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. తనకు ఆ ఆలోచన రాలేదని అన్నారు. అమ్మవారి ఫోటో ఇచ్చారు. ఆ అమ్మవారే తనను ఎంచుకున్నప్పుడు ఆ పాత్ర చేయను అని చెప్పడానికి నేనెవర్నిని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే ఈ పాత్ర వచ్చిందని, ఇప్పటికీ అమ్మవారిని నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?

కొన్ని సినిమాలును థియేటర్లో మాత్రమే చూడాలి అనడం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాంటి మూవినే పుష్పక విమానం, ఈ మూవీ విడుదల అయ్యి 36 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత ఆ మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ పేజీని సృష్టించుకుంది. కమర్షియల్ హీరోలు సాధారణంగా ప్రయోగాలు చేయడానికి సాహసించరు. కానీ కమల్ హాసన్ ఎన్నో చిత్రాలలో ప్రయోగాలు చేశారు.
అలాంటి సినిమాలలో క్లాసిక్ మూవీ పుష్పక విమానం ఒకటి. ఇలాంటి మూవీ చూసే థియేటర్ లో చూసే అవకాశం నేటి తరం ప్రేక్షకులకు అందివ్వాలని ఈ సినిమాని రీరిలీజ్ చేయబోతున్నారట. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూకీ మూవీలో డైలాగ్స్ ఉండవు. సైగల ద్వారా మాత్రమే చిత్రంలోని క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూ, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా స్టోరీ అర్థమయ్యే విధంగా గొప్పగా తెరకెక్కించారు. 1987లో ఈ మూవీ కన్నడ భాషలో రూపొందింది.
ఆ తరువాత తెలుగులో పుష్పక విమానం, తమిళంలో పేసుం పదం, హిందీలో పుష్పక్ గా విడుదల చేశారు. ఈ మూవీలో కమల్ హాసన్, అమల, ప్రతాప్ పోతన్, టిను ఆనంద్, పీఎల్ నారాయణ వంటి వారు అద్భుతమైన నటనతో కట్టిపడేసేలా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎల్ వైద్యనాథన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సైలెంట్ డ్రామాకు ప్రాణం పోశారు. కమర్షియల్ అంశాలు, మాస్ మాసాలా వంటివి లేకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. 35 లక్షల బడ్జెట్ తో మూవీ తీస్తే, కోటి రూపాయలు పైగా కలెక్ట్ చేసి, అప్పట్లో రికార్డు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1964లో ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఎన్టీఆర్, ఏయన్ఆర్ నటించిన సినిమాలకు వచ్చాయి. వీరిద్దరూ హిందీ, తమిళ చిత్రాలలో నటించారు. అలాగే వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఎన్టీఆర్ నిమ్మకూరు నుండి వస్తే, ఏయన్నార్ గుడివాడలోని వెంకట రాఘవపురం నుండి వచ్చారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి తమ వారసులను అందించగా, వారిద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఇప్పటికీ రాణిస్తున్నారు.
నందమూరి, అక్కినేని కుటుంబాల నుండి మూడవ జనరేషన్ వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఏయన్ఆర్ మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ మాత్రమే కాకుండా సుమంత్, సుశాంత్ కూడా పలు సినిమాలలో నటించారు.
ఎన్టీ రామరావు తన భార్య పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ను నిర్మించగా, ఏయన్ఆర్ తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. వీరిద్దరి భార్యలు వీరి కన్నా ముందు మరణించారు. ఎన్టీ రామరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఏయన్ఆర్ తో సంప్రదించారు. ఏయన్ఆర్ ని పాలిటిక్స్ లోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు ఆరోగ్య సమస్యల వల్ల రాలేనని, ఎన్టీ రామరావుకు అభినందనలు తెలిపారు.
ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరు అభిప్రాయభేదాలతో చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తరువాత మళ్ళీ కలిసిపోయారు. ఎంతో అనుబంధం ఉన్న వీరిద్దరు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా, ఏరోజు బహిరంగంగా నిందించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి క్రమశిక్షణ, స్టార్డమ్ నేర్పిన ఈ లెజండరీ నటులిద్దరూ జనవరి నెలలోనే తుదిశ్వాస విడిచారు.
యాంకర్ సుమ తెలుగులో టాప్ మరియు స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ చాలా బిజీగా ఉండే, అత్యంత కాస్ట్లీ మరియు టాలెంటెడ్ యాంకర్. యాంకర్ లలో ఎక్కువగా సంపాదిస్తున్న యాంకర్ కూడా సుమనే అని చెప్పవచ్చు. ఒక వైపు షోస్, మూవీ ఈవెంట్స్ చేస్తూ, మరోవైపు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే, సుమ, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి, 24 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సుమ కెరీర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ లో, సినిమాలలో నటించింది. ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ క్రమంలోనే సుమ దేవదాస్ కనకాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం, అది కాస్త ప్రేమ, ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లింది. వీరి పెళ్లి 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. ఈ జంటకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సుమ తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పెళ్లి కార్డ్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ కి ” మీరు కార్డు చదివారా?
హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీకి చెందిన నితిన్, ప్రవల్లికలు సంవత్సరం క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని, ఆ కాలనీలో జీవిస్తున్నారు. నితిన్ ఆటో నడుపుతూ ప్రవల్లికను పోషిస్తున్నాడు. ఈ జంటకు సెప్టెంబర్ 7న పాప జన్మించింది. అయితే పుట్టిన వెంటనే ఆ పాపకు అనారోగ్య సమస్యలు రావడంతో నిలోఫర్ హస్పటల్ లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ పై ఉంచి పాపకు చికిత్స అందించారు.
పాప ఆరోగ్యం బాగుపడడంతో ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్ళిన తరువాత పాప శరీరంలో మార్పు రావటంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. పాపను పరిశీలించిన డాక్టర్, చికిత్స అవసరమని ప్రైవేటు హాస్పటల్ కు తీసుకువెళ్లాలని చెప్పడంతో పాపను పిసల్‌బండలోని ఒక ప్రైవేటు హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఆ హాస్పటల్ లో జాయిన్ చేసుకున్న వైద్యులు పాపకు మెరుగైన చికిత్సను అందించారు. ఏడురోజుల చికిత్స తరువాత పాప కోలుకుంది.
వైద్యానికి లక్షా 16 వేల రూపాయల బిల్లు వేశారు. కానీ వారి దగ్గర 35 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ నిరుపేద దంపతులు దగ్గర ఉన్న రూ.35 వేలు హాస్పటల్ చెల్లించారు. మిగతా డబ్బు సర్దుబాటు అవకపోవడంతో బిల్లు కట్టలేక పాపను హస్పటల్ లోనే వదిలేసి వచ్చారు. మంగళవారం నాడు సేవాలాల్ బంజారా సంఘం ఆఫీస్ లో ఆ జంట మీడియాతో మాట్లాడుతూ తమ బాధను చెప్పుకున్నారు. సంఘం ప్రెసిడెంట్ కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ, ఎవరైనా దాతలు ఈ నిరుపేద ఫ్యామిలీకి హాస్పటల్ బిల్లు కట్టేందుకు సహాయం చేయమని కోరారు.




కుమార్తె మీరా మరణంతో విజయ్ ఆంటోనీ దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పోస్ట్ మార్టం అనంతరం మీరా భౌతిక కాయాన్ని విజయ్ ఆంటోనీ దంపతులు ఇంటికి తరలించారు. మీరాను కడసారి చూడడం కోసం తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. విజయ్ ఆంటోనీని ఓదారస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు ధైర్యం చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యకు వ్యతిరేక అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్రచారకర్తగా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్‌టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
ఏపీ హైకోర్టులో హరీష్ సాల్వే వాదించిన విషయాలు..
సిద్ధార్థ లూథ్రా వాదనలు..
అతిథి వెబ్ సిరీస్ ను ప్రవీణ్ నిర్మించగా, భరత్ వై.జి. తెరకెక్కించారు. హీరో వేణు తొట్టెంపూడి ప్రధాన పాతరలో నటించిన ఈ సిరీస్ లో అవంతిక మిశ్రా, అదితి గౌతమ్ ,వెంకటేశ్ కాకుమాను, రవి వర్మ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్టోరీ రైటర్ రవి వర్మ (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) భార్యాభర్తలు. సంధ్య నిలయం అనే పెద్ద భవనంలో జీవిస్తూ ఉంటారు. రవివర్మ భార్య సంధ్యకు పక్షవాతం రావడం వల్ల బెడ్ కే పరిమితమవుతుంది. రవివర్మ భార్యకు సేవలు చేస్తూ, కథలు రాస్తూ జీవిస్తుంటాడు.
ఒక రోజు అతను రాసిన స్టోరీలోలానే వర్షం కురిసిన ఆ రాత్రి రవివర్మ బంగ్లాకి మాయ (అవంతిక) అనే యువతి వస్తుంది. మరోవైపు యూట్యూబర్ అయిన సవేరి (వెంకటేష్ కాకుమాను) దెయ్యాలు లేవనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి తన ఛానెల్ లో పెడుతుంటాడు. ఆ క్రమంలోనే సవేరి తనను దెయ్యం వెంబడిస్తుందనే భయంతో రవివర్మ బంగ్లాకి వస్తాడు. సవారి మాయను దెయ్యం అని సందేహపడుతాడు. కానీ ఆ ఇంట్లోనే మాయ మరణిస్తుంది. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? మాయ దెయ్యం అనుకున్న సవారి సందేహం నిజమైందా? ఆఖరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
ఆరు ఎపిసోడ్ లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో తొలి మూడు ఎపిసోడ్స్ క్యూరియాసిటీ కలిగేలా చేశాయి. అయితే ఆ తర్వాత ఎపిసోడ్ లు రొటీన్ ఫార్మేట్లోకి వచ్చిన భావన కలుగుతుంది. హీరో వేణు ఇప్పటివరకు కామెడీ పాత్రలను ఎక్కువగా చేశాడు. ఇందులో పూర్తిగా సీరియస్ పాత్రలో కనిపిస్తారు. రచయిత రవి వర్మగా సెటిల్డ్ గా నటించాడు. అధితి గౌతమ్ సంధ్యగా పర్వాలేదనిపించింది. మాయ పాత్ర చేసిన అవంతిక నటనతో ఆకట్టుకుంది.