హిందు సంప్రదాయంలో ఆచారాలు, ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో అన్నింటిని పాటించకపోయినా, కొన్నింటిని మాత్రం అందరు తప్పనిసరిగా పాటిస్తుంటారు. అలాంటివాటిలో కొన్ని పనులు చేసి వస్తున్నప్పుడు లేదా కొన్ని గుడులకు వెళ్లినప్పుడు అక్కడి నుండి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వస్తారు. వాటిలో ఒకటి అంత్యక్రియలు.
ఎవరైనా మరణించినపుడు అది ఇంట్లో వారు కానీ, తెలిసినవారి అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు. అలాగే చేస్తారు. అయితే ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? చూస్తే ఏం అవుతుందనేది ఇప్పుడు చూద్దాం..
హిందు సనాతన ధర్మంలో మనిషి మృతికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్ళిన అనంతరం చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయోజనం మరియు క్షేమం కోసం పాటించాల్సిన పదహారు సంస్కారాలను సనాతన ధర్మంలో వివరించారు. వీటిలో ఒకటి మనిషి చనిపోయిన తరువాత చేసే కార్యక్రమానికి సంబంధించినది.
ఒక మనిషి మరణం తరువాత అంతిమ సంస్కారాలు, ఆచారాలు పూర్తి అయిన తర్వాత ఆత్మ వెళ్ళి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలు అన్ని తొలగిపోతాయి. గరుడ పురాణంలో అంత్యక్రియలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి వివరించారు. గరుడ పురాణం ప్రకారంగా అంత్యక్రియల తరువాత మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు.
ఒకవేళ అలా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో ప్రేమలో పడుతుందట. తన మరణం వల్ల ఆ వ్యక్తి ఒక్కరే బాధ పడుతున్నాడని ఆత్మ భావిస్తుందట. అలాంటి స్థితిలో ఆ ఆత్మకు శాంతి కలగదు. ఆత్మ ఆ వ్యక్తితో అనుబంధాన్నిపెంచుకుని, తనతో పాటు ఇంటికి వెళ్లాలని భావిస్తుందంట. ఈ కారణం వల్లనే అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు.
Also Read: మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏమవుతుంది అంటే..?

మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సీఎస్కే కెప్టెన్ గా ధోని ఇప్పటి దాకా సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోని భారత జట్టు ఫినిషర్‌గా ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ధోని కెరీర్లో అంతర్జాతీయంగా 90 టెస్ట్ మ్యాచులు, 350 వన్డే మ్యాచులు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773 పరుగులు, టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2020లో ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా 2010లో జూలై 4న ధోని సాక్షిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2015లో ఫిబ్రవరి 6న కుమార్తె జన్మించింది. ఆమె పేరు జివా. రిటైర్మెంట్ తరువాత ఫ్యామిలీతో గడుపుతున్న ధోనీ, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇటీవల తన పేరుతోనే ఒక ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ కు సీఈఓ బాధ్యతను ధోనీ తన అత్తగారికి అప్పగించారు. ఆమె ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన నిర్మాణ సంస్థలో ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోసం భార్య సాక్షి సింగ్, అత్తగారు షీలా సింగ్‌కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించాడని తెలుస్తోంది. ఇక ఈ సంస్థ విలువ సుమారు 800 కోట్లని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థలో సాక్షి సింగ్ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్‌లోని రావణుని లంక అచ్చం థోర్ అస్గార్డ్ లాగా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదిపురుష్‌లోని పోరాట సన్నివేశాలను కూడా హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
సొంత ఇల్లు లేకపోవడంతో ఎన్నో కష్టాల మధ్య పెరిగిన మాస్టర్ చిన్నతనం నుండి ముక్కుసూటిగా మాట్లాడేవారు. స్కూల్ కి పంపించిన చదువు మీద ఆసక్తి లేకపోవడంతో తల్లితో ఉంటూ పని చేసేవాడు. కష్టపడి సొంత ఇల్లు కట్టుకోగలిగారు.రాకేష్ మాస్టర్ కి చిన్నతనం నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎక్కడ సంగీతం వినిపించినా డ్యాన్స్ వేసేవాడు. అది పెళ్లి పాటలకు అయినా, శవాల దగ్గర డప్పుల చప్పుడికి డ్యాన్స్ వేసేవాడు.
డ్యాన్స్ స్కూల్ కి పేరు రావడం, ఆర్ధికంగా మాస్టర్ నిలదొక్కుకున్నాడు. డబ్బులు రావడంతో సినిమాలలో చేరాలనే పట్టుదలతో మళ్ళీ మద్రాస్ ట్రైన్ ఎక్కాడు. మాస్టర్ మద్రాసులో ఛాన్స్ ల కోసం వెతుకున్న సమయంలో పరిచయం అయిన సుధా అనే మేనేజర్ ద్వారా ముక్కు రాజు మాస్టర్ ని రాకేష్ మాస్టర్ కలిశారు. ఆ సమయంలో ముక్కు రాజు మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్. ఆయన వద్ద పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఉండేవారు. రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని కలిసిన తరువాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వేసి రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ముక్కు రాజు మాస్టర్ రాకేష్ మాస్టరుని తన దగ్గర ఉన్నపద్నాలుగు మంది డ్యాన్సర్లకు హెడ్ ని చేశారు. కానీ రాకేష్ మాస్టర్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఆ పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఆయన పై పగ పట్టారు. అయినా కూడా రాకేష్ మాస్టర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఆ డ్యాన్సర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గురువు ముక్కు రాజు మాస్టర్ చెప్పిన సలహాతో వేరే ప్రాంతానికి వెళ్లిన మాస్టర్, డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి బాగా పాపులర్ అయ్యాడు.
వేణు హీరో అవకుముందు రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. తాను హీరో అయిన తరువాత చిరునవ్వుతో సినిమా కోసం రాకేష్ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా చేశారు. అందులో ‘నిన్నలా మొన్నలా’ అనే పాటకు కొరియోగ్రాఫి చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ పాటతో రాకేష్ మాస్టర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆయన 1500 సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.
1. తుపాకి మూవీ వివాదం:
2. తలైవా వివాదం:
రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసింది. అయితే విజయ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన తర్వాత మూవీ రిలీజ్ తమిళనాడు లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయిన వారానికి తమిళనాడులో విడుదలైంది. దీంతో సినిమాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని వల్ల మేకర్స్ ఆర్థికంగా నష్టపోయారు.
5. మెర్సల్ వివాదం:
6. సర్కార్ వివాదం: 2018
7. బిగిల్ సినిమా వివాదం:
8. ఆదాయపు పన్ను దాడులు:
9. తల్లిదండ్రులపై కేసు:
10. రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు:
11. ట్రాఫిక్ ఉల్లంఘన నియమాలు
12. విడాకుల పుకార్లు:
అయితే వారి సన్నిహిత వర్గాలు రూమర్స్ మాత్రమే అని తెలిపాయి. అప్పటితో ఈ వార్తలు ఆగిపోయాయి.
ఇంగ్లండ్ సంవత్సర కాలంగా జట్టు బజ్‌బాల్ క్రికెట్‌తో మంచి ఫలితాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టు బెన్‌స్టోక్స్ సారధ్యంలో కొత్తగా కనిపించింది. ఈ జట్టు బజ్‌బాల్ తో సౌతాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్నది సిరీస్ ప్రతిష్టాత్మక యాషెస్, రీసెంట్ గా ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను బజ్‌బాల్ టెక్నిక్ తో ఎదుర్కొని మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవలేకపోయింది.
‘బజ్‌బాల్’ అంటే..
పేరు ఎలా వచ్చిందంటే..
ఇక ఈ ఆలోచన కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ది అందువల్ల ఈ విధానానికి ‘బజ్‌బాల్’ పేరు వచ్చిందనుకోవచ్చు. అయితే పాపులర్ క్రికెట్ పోర్టల్ జర్నలిస్టు తొలిసారిగా ఈ పేరును వాడాడు. ఆ తర్వాత ఇది అలాగే పాపులర్ అయ్యిందని తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ రాముడిగా, సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, వేషధారణ పై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ప్రశంసలు కురిపించారు.
పూజారి రంగరాజన్ మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి శ్రీ రాముడి గుణాలు గురించి అంతా వెతుకుతున్నారని, ఆదిపురుష్ లో చూపించినట్లుగానే రామాయణం ఉందా? వేరే విధంగా ఉందా అని వెతుకుతున్నారు. ప్రపంచమంతా రాములవారి గురించి మాట్లాడేటట్టు చేసినందుకు ఆదిపురుష్ మూవీ యూనిట్ ను అభినందిస్తున్నాను.
ఇక రావణాసురుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఇలా చూపించారని సోషల్ మీడియాలో విమర్శించేవారిని ఉద్దేశించి, ఆదికవి వాల్మీకిలగా రామాయణాన్ని ఎవరు తీయలేరు. వేరే ఎవరు ప్రయత్నం చేసినా దానిలో ఏదో కొదవ ఉంటుందని అన్నారు. దానిని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా రాములవారి వైభవాన్ని కీర్తించే ఈ మూవీని తప్పకుండా చూడాలని అన్నారు.
ఆంజనేయుడు దేవుడు కాదని, భక్తుడు మాత్రమే అని ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా చిత్రయూనిట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ అందరిని కాల్చేయాలని అన్నారు. ముఖేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ‘రామాయణానికి ఆదిపురుష్ ని మించిన అవమానం లేదని, డైరెక్టర్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
ఇక రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అర్థంలేని డైలాగ్స్ ని రాసారని, ఇటువంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని, ఈ మూవీని తీసినవారిని క్షమించకూడదు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా తెలియదని, హిరణ్యకశ్యపుడి వరాన్ని రావణుడికి చెప్పించారని, రామాయణాన్ని ఇంత అపహాస్యం చేసి, మూవీ యూనిట్ తమను తాము ఇంకా సమర్ధించు కుంటున్నారు.
ఈ మూవీ యూనిట్ మొత్తాన్ని కూడా 50 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలబెట్టి తగలబెట్టాలని అన్నారు. మూవీ పై విమర్శలు వస్తే, మౌనంగా ఉంటారని అనుకున్నాను. అయితే చిత్రయూనిట్ సనాతన ధర్మం కోసమే చేసినట్టు చెబుతున్నారు. వారు రామాయణాన్ని మొత్తం మార్చేశారు అని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.
ఆది పురుష్ 500 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ, ఈ మూవీ త్రీడిలో తీయడంతో ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తితో ఎదురుచూశారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ పై వివాదం రాగా, మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది.
ఆదిపురుష్ వివాదాలు, విమర్శల మధ్య బాక్సాఫీసు దగ్గర కొనసాగుతోంది. మూడు రోజుల్లో 340 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ, నాలుగవ రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు అంటున్నారు. ఈ మూవీ దర్శకుడు ఓంరౌత్ ను, రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని మరొక విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఈ మూవీలో చూపించిన లంక సీన్ ను హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేసినట్లు గమనించారు. ఆ సినిమా ఏమిటంటే థోర్, ఆ సినిమాలోని అస్గార్డ్ సెట్ ను కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అందులో గోల్డ్ కలర్ లో ఉంటే, ఆదిపురుష్ బ్లాక్ కలర్ లో చూపించారని డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ మూవీలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కు కొరియోగ్రఫర్ గా పని చేశానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. చిరునవ్వుతో సినిమానే రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రఫర్ గా తొలి సినిమా. వేణు సార్ వల్లే తన లైఫ్ గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.