Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను దుఖంలోకి నెట్టింది. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కుమారుడు మహేష్ బాబు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయనకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.
ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్‌కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.
Harika
Harika
Hi, This is Harika. I have been working as a web content writer in Telugu Adda from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.
8 సంవత్సరాల ముందు ఎవరూ పట్టించుకోని “షార్ట్ ఫిల్మ్” ట్వీట్… ఇప్పుడు “డైరెక్టర్” అయ్యాక వైరల్ అవుతోంది..! సక్సెస్ అంటే ఇదేనేమో.?
దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల తమిళంలో విడుదలైన ‘లవ్ టుడే’ తో విజయం సాధించాడు. ప్రేక్షకులు రొటీన్ సినిమాలను దూరం పెట్టేస్తున్నారు. కంటెంట్ బావుంటే చాలు, హీరోతో ఎవరు అని చూడకుండా సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు.
అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘లవ్ టుడే’. ఇప్పటి యువత సెల్ ఫోన్స్ మీద ఎలా ఆధారపడుతున్నారు. ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకవేళ ఒకరి సెల్ ఫోన్స్‌లో సీక్రెట్స్ మరొకరి తెలిసినపుడు ఎలాంటి గొడవలు వస్తాయి అనే కాన్సెప్ట్ తో తీశారు.అంతేకాకుండా ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా అరంగేట్రం కూడా చేశాడు. ఇదే మూవీ ఈరోజు తెలుగులో విడుదలైంది.

ప్రదీప్ రంగనాథన్ ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. వాటిలో ఒకటి అప్పా లాక్, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఆధారంగానే లవ్ టుడే సినిమాని తీశాడు. అయితే అప్పట్లో అంటే ఎనిమిది సంవత్సరాలకు ముందు తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందిగా నటుడు ప్రేమ్ జీ అమరన్ ని అడిగాడు.

అయితే అతను ఆ ట్వీట్ కి అప్పడు సమాధానం ఇవ్వలేదు. ‘లవ్ టుడే’ విడుదలై విజయం పొందిన తరువాత సమాధానం ఇచ్చాడు. అయితే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌కి, ప్రేమ్ జీ అమరన్ ఎనిమిదేళ్లు ఆలస్యంగా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

అంతేకాకుండా దర్శకుడి గురించి మరింత తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రదీప్ రంగనాథన్ పాత సోషల్ మీడియా పోస్ట్‌లను చూస్తున్నారు. సినిమాపై అతనికున్న ప్రేమ గురించి తెలుసుకుంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ ట్వీట్లలో సినీ తారలను దర్శకత్వం చేసే అవకాశం కోసం అభ్యర్దించారు. ఇప్పుడా పాత ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ‘లవ్ టుడే’ని ప్రదీప్ రంగనాథన్ ఐదేళ్లు ముందు రాసుకున్న అప్పా లాక్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీశారు. నేటి కాలం యువత సెల్ ఫోన్స్ కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ప్రేమికులకి ఒకరి సెల్ ఫోన్స్‌లో సీక్రెట్స్ మరొకరి తెలిస్తే ఎలాంటి గొడవలు వస్తాయి అనేదాన్ని కామెడీ కోణంలో చూపించారు.

ఎవరైనా మన నుండి ఒక విషయాన్ని దాచి పెడుతున్నారంటే వాళ్లు తప్పు చేసినట్టు కాదని చక్కగా చూపించారు. ఈ సినిమాకి సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించారు.
Itlu Maredumilli Prajaneekam Review : “అల్లరి నరేష్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
- చిత్రం : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
- నటీనటులు : అల్లరి నరేష్ ,ఆనంది, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రఘుబాబు, ప్రవీణ్,
- నిర్మాత : రాజేష్ దండా
- దర్శకత్వం : ఏఆర్ మోహన్
- సంగీతం : శ్రీచరణ్ పాకాల
- విడుదల తేదీ : నవంబర్ 25, 2022

స్టోరీ :
Itlu Maredumilli Prajaneekam Review: అల్లరి నరేష్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. మారేడుమిల్లి రాజకీయ నాయకుడు రాబోయే ఎలెక్షన్స్ కోసం అక్కడ నివసించే అటవీ వాసులని ఓటర్లుగా పరిగణించాలని నిర్ణయించుకుని, అల్లరి నరేష్‌ను ఎన్నికల డ్యూటీ కోసం గిరిజన ప్రాంతానికి పంపుతారు. ఈ క్రమంలో అప్పన్న అనే అతను ఓటు వేయడానికి ఇష్టపడడు. ఆ తరువాత అతను రాజకీయ వ్యక్తుల చేతుల్లో హత్య చేయబడతాడు. అల్లరి నరేష్ అప్పనకు న్యాయం జరిగేలా పోరాడదానికి సిద్దపడతాడు. మారేడుమిల్లిలో గిరిజన సమస్యలను ఎలా తీర్చాడు. అప్పన్నకు జరిగిన నష్టానికి న్యాయం చేయగలిగాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

Itlu Maredumilli Prajaneekam Review in Telugu రివ్యూ :
హీరో అల్లరి నరేష్ ఈమధ్య కాలంలో వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. గత ఏడాది నాందితో మెప్పించాడు. ఇప్పుడు కూడా మళ్లీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే కంటెంట్ బేస్ మూవీతో వచ్చాడు. అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. అల్లరి నరేష్ సినిమాని తన భుజం పై మోస్తూ శ్రీనివాస్ పాత్రను ఒంటిచేత్తో మోసాడు.హీరోయిన్ ఆనందికి నటనకి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది.అయితే ఆనందికి పెద్దగా స్క్రీన్ స్పేస్ రాలేదు కానీ తక్కువ పాత్రలో తనని తాను నిరూపించుకుంది. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. సంపత్ రాజ్, రఘుబాబు, ప్రవీణ్, ఇతర నటీనటులు సినిమాలో తమ పాత్రమేర న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :
- కథ
- స్క్రీన్ ప్లే
- అల్లరి నరేష్ నటన
మైనస్ పాయింట్స్:
- స్లో నేరేషన్
రేటింగ్ :
2.5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారికి మాత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
IPL 2023: 2023 ఐపీఎల్ కోసం మినీ వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. అయితే ఈ క్రమంలో ప్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదులుకుని,కొందరిని వేలంలో కొంటాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్రావోను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే సీఎస్కే సాధించిన ఎన్నో విజయాల్లో బ్రావో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థులను బ్రావో తన స్లోబాల్స్తో ముప్పుతిప్పలు పెడతాడు. అలాంటి అతన్ని మినీ వేలానికి ముందే రిలీజ్ చేస్తున్నామని సీఎస్కే తెలిపింది. అయితే బ్రావోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్. అతని కెరీర్లో ఆడిన 161 ఐపీఎల్ మ్యాచుల్లో 183 వికెట్లు తీసుకున్నాడు. ఇపుడు బ్రావో వయసు 39 ఏళ్లు. అందుకేనేమో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే సీఎస్కే అతన్ని వదులుకుందని తెలుస్తోంది.ప్రస్తుతం అతనికి ఆ టీం ఇచ్చే శాలరీ రూ.4.4 కోట్లు.
ఐపీఎల్లో ట్యాలెంటె ఉన్న ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుందనడంలో సందేహమే లేదు. వారి దురదృష్టం కొద్ది ధర కాస్త అటూ ఇటూ అయినా కూడా పోటీ మాత్రం చాలా ఉంటుంది. కానీ ఈ ఆల్‌రౌండర్ కోసం మూడు జట్లు కాచుకొని ఉన్నాయి.అయితే మరి ఆ జట్లు ఏమిటో చూద్దాం.
ముంబై ఇండియన్స్..
బ్రావో తన ఐపీఎల్ కెరీర్ ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే చేరుకునేలా ఉన్నాడు. తొలి మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో ఆ తరువాత చెన్నైతో కలిశాడు. ఇప్పుడు ముంబైలో ఆల్‌రౌండర్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంలో బ్రావోను తీసుకునే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ రాయల్స్ జట్టును ఒకసారి చూస్తే అందులో సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడా ఆ లోటును పూడ్చుకోవడానికి బ్రావో వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రావోను కేకేఆర్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసినా కూడా ఆడే పదకొండు మందిలో చోటు దక్కడం మాత్రం కష్టమే అనిపిస్తోంది. అయితే వీటిలో ఏ జట్టు బ్రావోను కొనుగోలు చేస్తుందో చూడాలి మరి.
అదిరిపోయే డ్యాన్స్ చేసిన రాధ.. హగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరు.. వీడియో వైరల్
80′ s Reunion: 80s రీయూనియన్ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నటీనటుల ఆత్మీయ సమ్మేళనం చాలా వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జాకీ ష్రాఫ్ ముంబయిలోని తన నివాసంలో ఏర్పాటు చేశారు.
తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఒకటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒకప్పటి అగ్రకథానాయిక రాధ చేసిన డ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు.

ఈ రీయూనియన్‌లో 80ల్లో వెండితెరపై సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ కలిశారు. నటీనటులందరూ ఒకప్పటి హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు చేసారు. అయితే రాధ సైతం ‘సంజ హై ముజె’ అనే హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ పాటకు అనుగుణంగా. హావభావాలు పలికిస్తూ చేసిన డ్యాన్స్‌కు అక్కడ ఉన్న అందరూ ఫిదా అయ్యారు. నటీనటులందరూ ‘వావ్ సూపర్’ అంటూ చప్పట్లు కొట్టి మరి ఆమెను ఉత్సాహపరిచారు. ఈ డ్యాన్స్ పూర్తయ్యేటప్పటికి వెంకటేశ్ ఓ పూలమాలను తీసుకువెళ్లి రాధ మెడలో వేయగా, మెగాస్టార్ వెళ్ళి హాగ్ చేసుకుని మెచ్చుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ ‘‘80 రీయూనియన్‌కు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం. నాకెంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. దీనికంటే సంతోషకరమైన విషయం నా స్నేహితులు చిరు, వెంకటేశ్,పూనమ్, జాకీ ష్రాఫ్, సరిత అక్క,స్వప్నతో పాటు అందరూ నాపై చూపించిన ప్రేమ’’ అని రాసుకొచ్చారు.ఈ రీయూనియన్‌కు జాకీ ష్రాఫ్ ఆతిథ్యమివ్వగా చిరంజీవి, వెంకటేశ్, రమ్యకృష్ణ,నదియా,సుహాసిని,విద్యాబాలన్, శోభన, జయప్రద, రాధ, భానుచందర్,శరత్‌కుమార్,అనుపమ్ ఖేర్, నరేశ్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
watch video :
Throwback to the 80’s reunion.
Felt so happy to dance to the steps to one of my favourite songs. More than that I loved the support & love
my dear colleagues Chiranjeevi, Venkatesh , Jackie Shroff, Poonam Dhillion, Swapna , Saritha akka & all others have showered on me 🥰🥰 pic.twitter.com/6e5ZbikEfN— Radha Nair (@ActressRadha) November 22, 2022
Godfather: అక్కడ అలా.. ఇక్కడ ఇలా..! మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్” ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Tollywood: డైరెక్టర్ మోహన్ రాజా డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదలై, మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అభిమానులకు నచ్చిందనే సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చి, ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు.
మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కింది గాడ్ ఫాదర్ మూవీ. కానీ తెలుగులో వచ్చిన లూసిఫర్ సినిమాను చూసినవారు గాడ్ ఫాదర్ మూవీని థియేటర్ లో చూడటానికి ఆసక్తి చూపలేదు. దాని ఫలితంగా గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అదే గాడ్ ఫాదర్ సినిమా ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ లో కొద్ది రోజులుగా స్ట్రీమింగ్ అవుతూ టాప్3 లో ట్రెండ్ అవుతోంది.అయితే థియేటర్లలో యావరేజ్ సినిమాగా నిలిచిన గాడ్ ఫాదర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారని నెటిజన్ల కామెంట్లుచెప్తున్నాయి.మెగాస్టార్ సినిమాలకు ప్రేక్షకులలో క్రేజ్ తగ్గలేదని చెప్పేందుకు ఇదే సాక్ష్యం అని మెగా ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలవగా, ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇక తమ హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ముఠామేస్త్రి సినిమా తర్వాత అలాంటి పాత్రలో చిరంజీవి నటిస్తుండటంతో అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.చాలాకాలం తరువాత చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Waltair Veerayya: వాల్తేర్ వీరయ్య “బాస్ పార్టీ” వీడియోలో.. హైలైట్ అవ్వనున్న విషయాలు ఇవేనా?
Tollywood: మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మొదటి పాటగా ‘బాస్ పార్టీ’ని విడుదల చేశారు. మెగాస్టార్ ఈ పాటలో తన డాన్స్ తో దుమ్ములేపారు. సహజంగానే మెగాస్టార్ చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కలయిక అంటే మోత మోగిపోవడం ఖాయం అని తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన శంకర్‌దాదా ఎంబీబీఎస్,శంకర్‌దాదా జిందాబాద్ పాటలో ఇప్పటికీ ఫేవరేట్. మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. చాలా గ్యాప్ తరవాత వీరిద్దరి కలయికతో మరో మాస్ పాట వచ్చింది.

మెగాస్టార్ నుంచి చాలా కాలం తరవాత అదిరిపోయే మాస్ సాంగ్ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్.ఇక మెగాస్టార్ చిరంజీవి అంటేనే అందరికీ ముందుగా గుర్తుచ్చేది డాన్స్. చిరంజీవి స్టెప్పులేస్తుంటే థియేటర్లలో జనాలు లేచి ఆడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మెగాస్టార్ నుండి అలాంటి పెర్ఫార్మెన్స్ రాలేదనే చెప్పాలి. ఆ లోటు తీర్చడానికి అన్నట్టుగా ‘బాస్ పార్టీ’ మంచి మాస్ బీట్ సాంగ్‌తో వచ్చారు చిరంజీవి. ఆయన నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’మూవీలో ‘బాస్ పార్టీ’ అంటూ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిన్న విడుదలైంది. ఈ పాటకు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి దేవి పాడారు.
ఇటీవలే విడుదలైన ‘బాస్ పార్టీ’ పాట ప్రోమో ఆసక్తిని పెంచింది. అయితే పాట కోసం వేసిన సెట్స్, చిరంజీవి వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ పాటను చూసి బాస్ దుమ్ములేపేశాడు అని సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పాటలో మరో ఆకర్షణ ఊర్వశి రౌతెలా. ఈ బాలీవుడ్ హీరోయిన్ మొదటిసారి తెలుగులో ప్రత్యేక గీతం చేసింది.. మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ మాస్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
సినిమాకి సంబంధం లేకపోయినా.. ఆ పాట ఎందుకు..? “వీర సింహా రెడ్డి” పై కామెంట్స్..!
Tollywood: బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ నుంచి బుధవారం న్యూ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ‘రాజసం నీ ఇంటిపేరు’ అని కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో వదిలారు. దీనిలో బాలయ్య వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ లో ‘జై బాలయ్య’అనే పాటను నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇక్కడే చాలామందికి ఒక పాట ఎందుకు పెట్టినట్టు అని సందేహం వచ్చింది. జై బాలయ్య అనేది సినిమాలో హీరో పేరు కాదు. పోనీ సినిమా పేరనుకుంటే అది కూడా కాదు. మరి ఈ జై బాలయ్య పాటను ఎందుకు పెట్టరా అని అనుకుంటున్నారు. ఇపుడే కాదు ఇంతకు ముందు అఖండ మూవీలో కూడా జై బాలయ్యతో ఒక పాట పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఇటు మెగాస్టార్ అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు వరుస అప్డేట్స్ ఇచ్చారు. నిన్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి ‘బాస్ పార్టీ’ పాటను విడుదల చేశారు. ఇంకో రెండు రోజుల్లో ‘వీరసింహారెడ్డి’ నుండి ‘జై బాలయ్య’ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం ఒక అప్డేట్ ఇచ్చింది. ‘రాజసం నీ ఇంటిపేరు’ అనే ఒక కొత్త పోస్టర్‌ను వదిలింది. బాలయ్య ఈ పోస్టర్లో వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది. బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ రాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతోంది. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మైత్రీ మేకర్స్ ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇస్తూ మూవీ పై అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు. ‘జై బాలయ్య’నవంబర్ 25న ఉదయం 10:29 గంటలకు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘రాజసం నీ ఇంటి పేరు’ అని పేర్కొంటూ నిర్మాతలు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్‌గా కనిపించారు బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’ టైమ్‌లో బాలయ్యలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy first single #JaiBalayya on November 25th at 10.29 AM ❤️🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/nYGn2dVRTv
— Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022
Tollywood: అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నటు తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అంటే నాగార్జున మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో నాగార్జున కూడా అదే బాటలో వెళ్తున్నారని సమాచారం.
టాలీవుడ్ హీరోల్లో అక్కినేని నాగార్జున న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందు వరుసలో ఉంటారు.నాగార్జున రాబోయే సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే మూడేళ్ల క్రితం విడుదలైన మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఆ సినిమానే పోరింజు మరియం జోస్. ఈ మూవీకి బెజవాడ ప్రసన్న కుమార్ రచయిత. సీనియర్ కథానాయకుడు అక్కినేని నాగార్జున ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు.

ఇప్పటివరకు చాలా మంది కొత్త దర్శకులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేసిన ఘనత నాగార్జునకే సొంతం అని చెప్పవచ్చు. కొత్త టాలెంట్‌ను గుర్తించి మరి, వారిని ఎంకరేజ్ చేసి, వారితో హిట్ సినిమాలు చేయటం అగ్ర హీరోల్లో నాగార్జునకే చెల్లుతుందనే టాక్ ఇప్పటికే ఉంది. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతునట్టుగా ఫిలిమ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నాగార్జున ఇటీవలే వచ్చిన తన చిత్రం ‘ది ఘోస్ట్’ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం పొందలేదు. దీంతో నాగార్జున కొంచెం గ్యాప్ ఇచ్చి, కొత్త కథలు వింటున్నారు. అయితే వీటిలో ఆయనకు ఓ కథ బాగా నచ్చిందంట. ఇంతకీ ఆ కథ రాసింది ఎవరో కాదు. నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ధమాకా చిత్రాల రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. అయితే నాగార్జున ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది బాగా ఆలోచించారట, మరి వేరే దర్శకుడు ఎందుకు అనుకున్నారేమో కానీ, ఫైనల్ గా రైటర్ ప్రసన్నకుమార్నే ఈ సినిమాకు దర్శకుడిగా చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.
ప్రసన్నకుమార్ చాలా కాలంగా దర్శకత్వం వహించాలని ఎదురు చూస్తున్నాడు. అందులోనూ నాగార్జున అంతటి హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు, ఓకే చెప్పేశాడట. నాగార్జున చేయబోతున్న మలయాళ రీమేక్ 2019లో విడుదలైన పొరింజు మరియం జోస్‌ను ప్రసన్నకుమార్ మన తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి వినిపించడంతో కథ ఆయనకు నచ్చేసింది. ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన విడుదలకానుంది.
Tollywood: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘హిట్2’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి సీక్వెల్ గా ‘హిట్ 2’ వస్తోంది. ఈ సినిమా నాచురల్ స్టార్ నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘హిట్’ కాంబినేషన్లోనే ఈ సినిమా రూపొందింది. కానీ ఇందులో హీరో హీరోయిన్లు మాత్రమే మారారు.
హిట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుహాని శర్మ నటించారు. హిట్2 లో అడివి శేష్, మీనాక్షి చౌదరి నటించారు. అయితే హీరోయిన్ సంగతి ఎలా ఉన్నప్పటికీ హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన విశ్వక్ ను హీరోగా మళ్ళీ ఎందుకు తీసుకోలేదు అనే సందేహం మాత్రం అందరిలోను కలిగింది. అయితే హిట్ సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో చేయాలని, తీసే ప్రతీ సీక్వెల్ కి హీరోని మార్చాలనే విశ్వక్ ను కాకుండా వేరే హీరోను తీసుకున్నట్లు డైరెక్టర్ శైలేష్ చెప్పుకొచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హిట్’. హీరో నాని నిర్మాతగా మారిన ఈ సినిమాతోనే శైలేష్ కొలను దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అయితే శైలేష్ కొలను ఒక డాక్టర్.ఆయనకు సినిమాలపై ఉన్న అమితమైన ఆసక్తి వల్ల దర్శకుడు అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.

అయితే విశ్వక్ సేన్ కు ‘హిట్2’ కథ నచ్చకపోవడం వల్లే ఈ సినిమాలో నటించలేదని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ శైలేష్ ‘హిట్3’మూవీని కూడా అడివి శేష్ తోనే చేయబోతున్నాడు. అయితే ఈ విషయాన్నిహీరో అడివి శేష్ స్వయంగా తెలిపాడు. అడివి శేష్ నిన్న జరిగిన ‘హిట్2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పాడు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ దర్శకుడు శైలేష్‌కి, మూవీ యూనిట్ అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్ అని, ట్రైలర్ ని ఇంత బాగా కట్ చేసినందుకు శైలేష్ గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో సెకండ్ పార్ట్ చాలా కీలకమైంది.
‘హిట్ 3’ లో కూడా నన్ను భాగం చేసినందుకు శైలేష్‌కు థాంక్స్. అయితే నార్త్ ఆడియెన్స్ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని అడిగేవారు. అందుకే నిర్మాత నాని గారితో మాట్లాడి, పాన్ ఇండియన్ వైడ్‌గా విడుదల చేయాలని నిర్ణయించాం. ఆడగగానే అంగీకరించిన నాని గారికి, ప్రశాంతి గారికి చాలా థాంక్స్. మరియు నాతో ఈ మూవీని నిర్మించినందుకు థాంక్స్ అని చెప్పారు.ట్రైలర్ లో ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంది. హీరోయిన్ మీనాక్షి గారు చాలా చక్కగా నటించారు. శ్రద్దా శ్రీనాధ్ గారు అద్భుతంగా నటించారు.
మేజర్‌లో చేసిన పాత్రకు ‘హిట్ 2’లో చేసిన పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు.ఒకరి కోసం కాకుండా కథ, డైరెక్టర్, నిర్మాత నాని అందరి కోసం ఈ మూవీని చేశాను. డిసెంబర్ 2న హిట్ 2 విడుదల కాబోతుంది. అయితే అడివి శేష్ ‘హిట్3’ గూర్చి చెప్పాడు. కానీ,ఇప్పుడు శేష్ ఇచ్చిన స్పీచ్ తో ‘విశ్వక్ సేన్ తన ఇగో వల్లే హిట్ 2లో చేయలేదా? అనే సందేహాలను రేకెత్తించాడు. అసలు విషయం ఏమిటో తెలియాల్సి ఉంది..
