మంచు విష్ణు “జిన్నా” మూవీ ఫ్లాప్ అయినప్పటికీ అందులోని “జారు మిఠాయ” సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా హిట్ అయిందని చెప్పవచ్చు. ఈ సాంగ్ మీద రీల్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు స్వయంగా “ఆవిడ మా ఊరు నుంచి వచ్చారు. పాట పాడుతారు” అని చెప్పే వరకు.. అసలు ఇలాంటి పాట ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు.
లిరిక్స్ , వాయిస్ బాగున్నాయని కొందరు. సన్నీ లియోన్ సాంగ్ అని ఇంకొందరు, ఇదో కొత్త రకం మిఠాయి అనుకున్న వారు మరికొందరు. ఇలా చాలా మంది ఈ పాట పైన తవ అభిప్రాయాలను కూడా ఏర్పరచుకున్నారు.
జిన్నా మూవీ థియేటర్లోకి వచ్చి వెళ్లి చాలా కాలం అయినప్పటికీ ఈ పాట మాత్రం జనాల మైండ్ లో స్టాండర్డ్ గా మిగిలిపోయింది అని చెప్పొచ్చు.

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో చాలా మంది టాలెంట్ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తోంది. అసలు ఈ పాట అర్థం ఏమిటి అన్న విషయంపై స్టేజి మీద పాడిన భారతీయ అనే మహిళను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఈ సందర్భంగా ఆమె ఈ పాట పుట్టుపూర్వోత్తరాల గురించి వివరంగా వివరించి చెప్పారు. భారతి చిత్తూరు జిల్లాలోని పారువాలు గ్రామం లో నివసిస్తారు. చిన్నతనంలో మేకలు, గొర్రెలు, కాయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి జానపద గేయాలను పాడేవాళ్ళమని.. అలా తాను కూడా ఇవి నేర్చుకున్నానని పేర్కొన్నారు.‘జంబలికిడి జారు మిఠాయి’ అనేది ఒక అమ్మాయి పేరట…మరి ‘మొగ్గలఖాలింగో’ అంటే.. అబ్బాయిలెవరు మన వైపు చూడట్లేదు అని అర్థమట.

అయితే ఈ పాట పాడినందుకుగాను మోహన్ బాబు తనకు 50 వేల రూపాయలు ఇచ్చారని ఆమె సంతోషంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో ఇలాంటి జానపద గేయాలకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.‘దారి చూడు దుమ్మూ జూడు మామ’, ” దాని పేరే సారంగదరియా…”ఇలా సినిమాలలో రిలీజ్ అయ్యి జానపద పాటలు సినిమాకే క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

























































మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.